సెక్స్ పాఠాలు: లేడీ ప్రొఫెసర్ చిన్నపాప కాదు, 50 ఏళ్లు, అన్నీ తెలుసు, కాలేజ్ అమ్మాయిలు!
చెన్నై: యూనివర్శిటీ ప్రొఫెసర్లు, సీనియర్ అధికారులకు లైంగిక కోర్కొలు తీర్చాలని కాలేజ్ అమ్మాయిల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించిన లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవీ చాల తెలివైనదని ఆమె సన్నిహితులే అంటున్నారని విచారణ చేస్తున్న సిట్ అధికారులు అంటున్నారు. లేడీ ప్రొఫెసర్ చిన్నపాప కాదని, 50 ఏళ్లు ఉన్నాయని, అన్నీ తెలుసని ఆమెతో పాటు అరెస్టు అయిన వ్యక్తి అంటున్నారు.
నిర్మలా దేవీని మరింత లోతుగా విచారణ చేస్తే ఆమె మరింత మంది అధికారుల పేర్లు చెప్పే అవకాశం ఉందని పలువురు కాలేజ్ అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్బంలో నిర్మలా దేవీ కేసులో అరెస్టు అయిన కరుప్పస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చీకటి రోజులు
కాలేజ్ అమ్మాయిలను వ్యభిచారకూపంలోకి దించాలని ప్రయత్నించారని ఆరోపిస్తూ అరుప్పుకోటైకు చెందిన అసిస్టెంట్ లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవీని సిట్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేశారు. నిర్మలా దేవీ ప్రస్తుతం జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నది.

పక్కా స్కెచ్ తో ట్రాప్
కాలేజ్ అమ్మాయిలతో లైంగిక కోర్కొలు తీర్చుకుని వారిని వ్యభిచారకూపంలోకి లాగాలని ప్రయత్నించారని ఆరోపిస్తూ నమోదు అయిన కేసులో నిర్మలా దేవీతో పాటు మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మురుగన్, అదే యూనివర్శిటీ స్కాలర్ విద్యార్థి కురుప్పుస్వామిని సిట్ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

చిన్నపాప కాదు 50 ఏళ్లు
నిర్మలా దేవీ వ్యవహారంలో స్కాలర్ విద్యార్థి కరుప్పుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడని సమాచారం. నిర్మలా దేవి చిన్నపాప కాదని, ఆమెకు 50 ఏళ్లు ఉన్నాయని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసిందని, ఏది మంచి, ఏది చెడు అనే విషయం ఆమెకు పూర్తిగా తెలుసని కరుప్పుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారని సిట్ కు చెందిన ఓ అధికారి అంటున్నారని తమిళ మీడియా అంటోంది.

లేడీ కిలాడి నోరు విప్పాలి
నిర్మలా దేవీ వ్యవహారం కేసులో అనవసరంగా తనను ఇరికించారని స్కాలర్ విద్యార్థి కరుప్పస్వామి ఆరోపణలు చేస్తున్నారని ఓ సిట్ అధికారి అంటున్నారు. నిర్మలా దేవీ పూర్తిగా నోరువిప్పితే అసలైన వ్యక్తుల బండారం బయటపడుతోందని కరుప్పుస్వామి సిట్ అధికారులకు చెప్పాడని సమాచారం.

సాక్షాలు కీలకం
నిర్మలా దేవీ వ్యవహారంలో పూర్తి సమాచారం సేకరించాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని 31 మంది సాక్షులను వేర్వేరుగా రహస్యంగా విచారణ చెయ్యాలని సిట్ అధికారులకు కోర్టు సూచించింది. మొత్తం మీద నిర్మలా దేవీ, మురుగన్, కరుప్పుస్వామి ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో సిట్ అధికారులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications