మంత్రి స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ ఆత్మహత్య: పళనిసామికి మరో తలనొప్పి !
తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకోవడంతో అన్నాడీఎంకే (అమ్మ) వర్గాలు హడలిపోయాయి. మంత్రి విజయభాస్కర్ అక్రమాస్తుల కేసులో విచారణకు రావాలని సుబ
చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకోవడంతో అన్నాడీఎంకే (అమ్మ) వర్గాలు హడలిపోయాయి. ఆదాయపన్ను శాఖ దాడులతో పీకలలోతుల్లో కూరుకుపోయిన విజయభాస్కర్ స్నేహితుడి ఆత్మహత్య సంచనలం సృష్టించింది.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు రూ. 89 కోట్ల బట్వాడా చేశారని తెలిసిందే. ఐటీశాఖ అధికారులు మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

విజయభాస్కర్ సన్నిహితులు, బంధువుల ఇళ్ల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. మంత్రి విజయభాస్కర్ కేసులోనే కాంట్రాక్టర్ సుబ్రమణ్యంకు చెందిన నమ్మక్కల్ ఇంటిలో ఐటీశాఖ అధికారులు సోదాలు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కాంట్రాక్టర్ సుబ్రమణ్యంను విచారణకు రావాలని ఐటీ శాఖ అధికారులు సూచించారు. అయితే ఆయన నమ్మక్కల్ లోని ఇంటిలో ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలకు దారి తీసింది. ఈ విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని నమ్మక్కల్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications