బంగాళాఖాతంలో అల్పపీడనం దెబ్బ: రాత్రంతా కుంభవృష్టి- నేడూ స్కూళ్లకు సెలవు

Bay of Bengal: వరుస అల్పపీడనాలు, తుఫాన్లు తాకిడి కొనసాగుతూ వస్తోంది. ఒకదాని వెంట ఒకటిగా అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి దాదాపు రెండు నెలల నుంచి. ప్రతి సంవత్సరం నవంబర్/డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం సహజమే అయినప్పటికీ- ఇప్పుడు దీని తీవ్రత మరింత పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర అల్పపీడనంగా రూపు దాల్చింది. ఇది వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం లేదని చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది.

Tamil Nadu rains Holiday declared for schools several districts due low pressure in Bay of Bengal

దీని ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా కడలూరు, మైలాడుథురై, నాగపట్నం, కరైకల్, చెంగల్పట్టు, విల్లుపురంలల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరువారూరు, తంజావూరు, కాళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగ, తూత్తుకూడి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తోన్నాయి.

వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. చెన్నై సహా 10 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాడుథురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూరు, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు నేడు తెరచుకోవు.

మధురై, మైలాడుథురై, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల కలెక్టర్లు ఎంఎస్ సంగీత, ఏపీ మహాభారతి, ధర్మకరాజ్, చంద్రకళ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవును ప్రకటించారు. నాగపట్నం జిల్లాలోని సెంబియన్ మహాదేవి గ్రామంలో గోడ కూలి కవియలగన్ అనే బాలుడు దుర్మరణం పాలయ్యాడు.

రాత్రంతా భారీ వర్షాలు దంచి కొట్టడం వల్ల చెన్నై, మధురై వంటి నగరాల్లో రోడ్లపై నీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చాలాచోట్ల రెండడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఏపీలో కూడా వర్ష తీవ్రత కొనసాగుతోంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు కలెక్టర్లు నేడు కూడా సెలవును ప్రకటించారు. ఆయా స్కూళ్లు, విద్యా సంస్థల యాజమాన్యాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+