Chiyaan Vikram:తమిళ హీరో విక్రమ్‌కు తీవ్రగాయాలు..!

Chiyaan Vikram:తమిళ హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తంగలాన్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకోవడంతో విక్రమ్ గాయపడ్డాడు. ఈ ఘటనలో విక్రమ్ పక్కటెముక విరిగినట్లు సమాచారం. సర్జరీ అవసరమని వైద్యులు చెప్పారు. కొద్ది రోజుల క్రితమే విక్రమ్ పొనియన్ సెల్వమ్-2 ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.

 vikarm

ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా గడిపిన చియాన్ విక్రమ్ తిరిగి చెన్నైలో తంగలాన్ సినిమా షూటింగ్‌కు హాజరయ్యాడు. ఇదే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. చియాన్ ప్రమాదానికి గురయ్యాడన్న వార్త దావనంలా వ్యాపించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే విక్రమ్ కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. విక్రమ్ ప్రమాదానికి గురయ్యాడన్న వార్త తమిళనాటలో చాలామందిని కలచివేసింది.

తంగలాన్ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.రిహార్సల్ చేస్తున్న సమయంలో విక్రమ్ పక్కటెముకలకు గాయాలయ్యాయి.దీంతో వైద్యులు సర్జరీ అవసరమని చెప్పినట్లు సమాచారం. కోలుకునేందుకు సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం తంగలాన్ చిత్రం షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.ఈ విషయాన్ని విక్రమ్ పీఆర్వో యువరాజ్ ధృవీకరిస్తూ ట్వీట్ చేశాడు.

ఇక తంగలాన్ చిత్రం విషయానికొస్తే పా రంజిత్ తొలిసారిగా చియాన్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.కర్నాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం చుట్టు ఈ కథ తిరుగుతుంది. వారి నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను రంజిత్ తెరకెక్కిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వరాలను సమకూరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+