సేవకా..సెలవిక: ముగిసిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు..మిన్నంటిన నినాదాలు

తమిళనాడులోని ఊటీ వద్ద ఓ ఆర్మీ హెలికాఫ్టర్ కొద్దిసేపటి క్రితం కుప్పకూలింది. ఇందులో పలువురు ఆర్మీ అధికారులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు పలువురు అధికారులు ప్రయాణిస్తున్న ఈ హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇది ఆర్మీకి చెందిన ఎంఐ 17 వీ5 ఛాపర్ గా గుర్తించారు.

Army Chopper Crash In Tamil Nadu live updates in Telugu: CDS Bipin Rawat on board

తమిళనాడులోని కూనూర్‌లో జంట ఇంజిన్లతో కూడిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెల్లింగ్టన్ కాంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Dec 10, 2021, 5:01 pm IST

ముగిసిన బిపిన్ రావత్ అంత్యక్రియలు 17తోపులతో గన్ సెల్యూట్
Dec 10, 2021, 4:40 pm IST

వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో మార్మోగుతున్న బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక
Dec 10, 2021, 4:31 pm IST

సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొన్న త్రివిధ దళాలకు చెందిన 800 మంది సైనికులు.17 తుపాకులతో బిపిన్ రావత్‌కు వందనం
Dec 10, 2021, 4:29 pm IST

ఇంకా గుర్తించని సాయితేజ భౌతికకాయం.. భౌతికకాయం గుర్తించాక చిత్తూరుకు తరలించే ఏర్పాట్లు
Dec 10, 2021, 4:27 pm IST

సైనిక లాంఛనాలతో జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న కూతుళ్లు
Dec 10, 2021, 4:19 pm IST

సీడీఎస్ బిపిన్ రావత్‌ దంపతుల పార్థీవదేహాలకు నివాళులు అర్పించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Dec 10, 2021, 4:18 pm IST

సీడీఎస్ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Dec 10, 2021, 3:49 pm IST

ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌ స్మశాన వాటికకు చేరుకున్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరియు ఆయన సతీమణి మధులికల పార్థీవదేహాలు
Dec 10, 2021, 2:24 pm IST

సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
Dec 10, 2021, 2:15 pm IST

కామరాజ్ మార్గంలోని తన నివాసం నుంచి అంతిమయాత్రం ప్రారంభం
Dec 10, 2021, 2:15 pm IST

ప్రారంభమైన జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంతిమ యాత్ర
Dec 10, 2021, 2:00 pm IST

బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించిన ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే,ఎయిర్‌ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి,నేవీ చీఫ్ హరి కుమార్
Dec 10, 2021, 1:26 pm IST

హెలికాఫ్టర్ కూలిన ప్రాంతంలో దర్యాప్తు ప్రారంభించిన స్థానిక పోలీసులు మరియు వాయుసేన అధికారులు
Dec 10, 2021, 1:15 pm IST

బిపిన్ దంపతులకు నివాళులు అర్పించిన రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్
Dec 10, 2021, 12:24 pm IST

నేనొక సైనికుడి భార్యను. మరణించిన తన భర్తకు ఘనంగా వీడ్కోలు పలకాలి.చిరునవ్వుతో సాగనంపాలి. దేశానికి ఇది తీరనిలోటు: బ్రిగేడియర్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్
Dec 10, 2021, 12:23 pm IST

నాకు త్వరలో 17 ఏళ్లు వస్తాయి. అంటే నా తండ్రి నాతో 17 ఏళ్లు ఉన్నారు.తనే నాకు ఆదర్శం, నా బెస్ట్ ఫ్రెండ్ నా హీరో. ఆ మధుర జ్ఞాపకాలతో జీవిస్తాం.తన తండ్రి మరణంతో పాటు ఇతరుల మరణం దేశానికి తీరనిలోటు: బ్రిగేడర్ లిడ్డర్ కుమార్తె ఆష్నా లిడ్డర్
Dec 10, 2021, 11:21 am IST

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరియు మధులికల కుమార్తెలు కృతిక, తరిణిలు తమ తల్లిదండ్రులకు కడసారి వీడ్కోలు పలికారు
Dec 10, 2021, 10:58 am IST

బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన తర్వాత కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు
Dec 10, 2021, 10:35 am IST

ముగిసిన బ్రిగేడియర్ లిడ్డర్ అంత్యక్రియలు. సైనిక లాంఛనాలతో జరిగిన అంత్యక్రియలు
Dec 10, 2021, 10:24 am IST

జనరల్ రావత్ పార్థీవదేహానికి నివాళులు అర్పించిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా
Dec 10, 2021, 10:23 am IST

కాసేపట్లో ప్రారంభం కానున్న అంత్యక్రియలు
Dec 09, 2021, 9:40 pm IST

అమరులకు మోడీ అంజలి
Dec 09, 2021, 9:25 pm IST

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వరుణ్ సింగ్‌ను పరామర్శించిన కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై
Dec 09, 2021, 9:18 pm IST

అమరవీరులకు అంజలి ఘటించిన ప్రధాని మోడీ
Dec 09, 2021, 9:16 pm IST

అమరవీరులకు ఆర్మీ చీఫ్ నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి నివాళులు
Dec 09, 2021, 9:15 pm IST

అమరవీరులకు అంజలి ఘటించిన అజిత్ ధోవల్
Dec 09, 2021, 9:07 pm IST

బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 11 మంది అమరులకు నివాళి అర్పించిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Dec 09, 2021, 9:05 pm IST

కాసేపట్లో పాలెం ఎయిర్ బేస్ చేరుకోనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Dec 09, 2021, 9:02 pm IST

పాలెం ఎయిర్ బేస్ నుంచి వెళ్లిపోతున్న ప్రధాని మోడీ
Dec 09, 2021, 9:00 pm IST

రావత్ సహా అమరవీరుల కుటుంబసభ్యులకు ప్రధాని మోడీ పరామర్శ
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+