చైనాకు భారీ షాక్ ఇచ్చిన భారత్- రాత్రికి రాత్రి..!!
భారత్.. పొరుగుదేశం చైనాకు భారీ షాక్ ఇచ్చింది. అక్కడి నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ పై భారీగా టారిఫ్ విధించింది. దీనిపై రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తక్కువ ధర కావడం, దేశీయ ఉక్కు పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి టారిఫ్ ను పెంచింది. చైనా నుండి వస్తున్న చవకైన ఉక్కు దిగుమతుల నుండి దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను సంరక్షించుకోవడమే దీని ఉద్దేశమని తెలిపింది.
మొదటి సంవత్సరంలో 12 శాతం టారిఫ్ ఉంటుంది. ఇది రెండో సంవత్సరానికి గరిష్ఠంగా 11.5 శాతానికి చేరుతుంది. మూడో సంవత్సరానికి 11 శాతానికి తగ్గుతుంది. ఈ తాజా టారిఫ్.. ఒక్క చైనాకు మాత్రమే పరిమితం కాలేదు. వియత్నాం, నేపాల్ నుండి దిగుమతి చేసుకునే స్టీల్ కూ వర్తిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు ఇది వర్తించదు.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ముడి ఇనుము ఉత్పత్తిదారు భారత్. ఈ మధ్యకాలంలో చైనా నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఇక్కడి కంటే తక్కువ ధరకు ముడి ఇనుము లభిస్తోండటమే దీనికి కారణం. ఇది- దేశీయ స్టీల్ ఉత్పత్తిదారులకు సవాల్ గా మారింది. పైగా యాంటీ-డంపింగ్ ఆందోళనలను పెంచుతోంది. ఈ ధోరణి ఉక్కు పరిశ్రమపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చవకైన దిగుమతులు, నాణ్యత రహిత ఉత్పత్తుల వల్ల దేశీయ ఉక్కు పరిశ్రమకు నష్టం వాటిల్లకూడదని కేంద్రం భావించింది. టారిఫ్ పెంచింది.
చైనా నుంచి భారీ మొత్తంలో స్టీల్ దిగుమతులు అకస్మాత్తుగా పెరగడం వల్ల దేశీయ పరిశ్రమకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అదనపు టారిఫ్ విధించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) సిఫారసు చేసింది. 2025 ఏప్రిల్‌లో కేంద్రం 200 రోజుల పాటు విదేశీ దిగుమతులపై 12 శాతం తాత్కాలిక టారిఫ్ విధించింది. ఇది నవంబర్ తో ముగిసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications