శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ పరిమితులు, ఆంక్షలు - వీరికే ఛాన్స్..!!
అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమల శరణుఘోషతో మారు మోగుతోంది. మకరజ్యోతి దర్శన పవిత్ర సమయం సమీపిస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఈ సారి పెరుగుతున్న రద్దీ వేళ ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్శన కోటాలో పరిమితులు విధించారు. కొన్ని ఆంక్షలు ప్రకటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా మకరజ్యోతి దర్శనం కోసం ఆలయ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
శబరిమలలో మకర సంక్రాంతి సాక్షాత్తు మణికంఠుడే 'మకర జ్యోతి'గా దర్శనమిచ్చే పవిత్ర సమయం సమీపిస్తోంది. ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధించారు. రద్దీని నియంత్ రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్ధీకరించారు. ఈ నెల 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించనున్నారు. అత్యంత కీలకమైన మకరజ్యోతి దర్శనం రోజున అంటే జనవరి 14న, రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన కోటాను 30 వేలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక 15 నుంచి 18 వరకు ప్రతిరోజూ 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు.

జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30వేలకు తగ్గిస్తూ అధికారులు తాజాగా అధికారులు నిర్ణయించారు. కాగా, ఈ రోజు పందళం నుంచి ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో 14న ఉదయం 10 గంటల నుండి నిలక్కల్-పంబ మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా రేపు సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు. భక్తుల రవాణా కోసం సుమారు వెయ్యి కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications