పది మంది అమ్మాయిలతో ఆడుకున్న ప్రభుత్వ స్కూల్ టీచర్, వీడి కథ వింటే?

తన స్కూల్‌లోని విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలపై ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని బెళగావి జిల్లాలోని చిక్కోడి పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. సాధిక్ అనే
ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కర్ణాటక పోలీసులు తెలిపారు. నిందితుడు సాధిక్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు.

అదే పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై సాధిక్ వేధింపులకు పాల్పడ్డాడు. టీచర్ సాధిక్ గురించి మొదట భయపడిన అమ్మాయి కొన్ని రోజులు సైలెంట్ గా ఉండిపోయింది. అయితే సాధిక్ టార్చర్ రోజురోజుకు ఎక్కువ కావడంతో విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు సాధిక్ పై ఆరోపణలు వచ్చినప్పుడు అతను విద్యార్థుల కుటుంబ సభ్యులపై ఎదురు తిరిగి వారిని బెదిరించాలని ప్రత్నించాడు.

Teacher arrested for physically abusing minor girls in government school

అయితే ఆ అమ్మాయితో పాటు అదే స్కూల్ లో పని చదువుకుంటున్న సుమారు పది మందికి పైగా విద్యార్థినులు మమ్మల్ని కూడా టీచర్ సాధిక్ వేధిస్తున్నాడని ఆరోపించారు. గత ఆరు నెలలుగా పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు టీచర్ సాధిక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పాఠాలు చెప్పే ముసుగులో మైనర్ విద్యార్థినులను బ్యాడ్ గా వారిని ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని అమ్మాయిలు ఆరోపించారు.

ఈ ఘటనపై తల్లిదండ్రులు చిక్కోడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడు సాదిక్ బేగ్‌పై అమ్మాయిలు ఫిర్యాదు చెయ్యడంతో నిందితుడిని పోలీసులు రాత్రి అరెస్టు చేశారు. చిక్కోడి పోలీస్ స్టేషన్‌లో నిందితుడు సాధిక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గత వారం బీదర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+