ఆంధ్రాహళ్లిలో ఏం జరిగింది, వీడియో వైరల్ తో మంత్రికి మండిపోయింది, దెబ్బకు మేడమ్ కథ క్లోజ్!
బెంగళూరులోని ఆంధ్రహళ్లి పాఠశాల విద్యార్థులు ఆ స్కూల్ లోని అన్ని టాయిలెట్‌ను శుభ్రం చేశారు. విద్యార్థులతో బాత్ రూమ్ లు, టాయిలెట్ లు శుభ్రం చేపిస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. విద్యార్థులతో నిత్యం బాత్ రూమ్ లు, టాయిలెట్ లు శుభ్రం చేయిస్తున్న టీచరమ్మను ఇంటికి పంపించేశారు.
బెంగళూరులోని ఆంధ్రాహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవమ్మను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కర్ణాటకవిద్యాశాఖా మంత్రి మధు బంగారప్ప స్పందించారు. ఆంధ్రహళ్లి పాఠశాలలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు అని విచారం వ్యక్తం చేశారు.

పిల్లల చేతుల్లో మరుగుదొడ్డి శుభ్రం చేయించడం వింటే అసహ్యం వేస్తోందని అన్నారు. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నామని మంత్రి మధు బంగారప్ప అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిదేవమ్మను ఇప్పటికే సస్పెండ్ చేశామని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో అని విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని మంత్రి మధు బంగారప్ప అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మధు బంగారప్ప స్పష్టం చేశారు. 600 మంది పిల్లలున్న ఆంధ్రహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు శెనగ చిక్కి (శెనగ స్వీట్) ఇచ్చి మరుగుదొడ్డి శుభ్రం చేయాలన్నారు. సాధారణంగా పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా భోజనం, పాలు, గుడ్లు అందజేస్తుంది.
#WATCH | Bengaluru: On the alleged incident of cleaning of toilets by school children in Andrahalli Government Primary School of Yeshwanthapura Assembly Constituency, LoP Karnataka R Ashok says, "...This is a govt school and cleaning of toilets is happening...For the last five to… pic.twitter.com/PT3TzDxVsu
— ANI (@ANI) December 22, 2023
కానీ టీచర్లు పిల్లతో ఇలాంటి పనులు చేయించడం నిజంగా అసహ్యం. ఇక్కడ మరుగుదొడ్డి ఎవరు శుభ్రం చేస్తారు అంటూ పిల్లలకు పోటీ పెడుతున్న టీచర్లు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారని వెలుగు చూసింది. టీచర్లు భోజనం చేసిన తరువాత వారి ప్లేట్లు కడగమని పిల్లలకు ఉపాధ్యాయులు చెబుతున్నారని వెలుగు చూసింది. ఈ విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications