వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను చంపి 70 ముక్కలు చేసి ఫ్రీజర్‌లో దాచిన టెక్కీ: దోషిగా తేల్చిన కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌లో ఏడేళ్ల క్రితం జరిగిన ఓ దారుణమైన హత్య గుర్తుండకపోవచ్చు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు 36 ఏళ్ల వయస్సుగల తన భార్యను చంపేసి, శవాన్ని 70 ముక్కలు చేసి డీప్ ఫ్రీజర్‌లో రెండు నెలల పాటు దాచి పెట్టాడు.

అత్యంత దారుణమైన హత్యకు పాల్పడిన ఆ టెక్కీని స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. శిక్షను శుక్రవారం ఖరారు చేయనుంది. కోర్టు దోషిగా తేల్చిన మరుక్షణం ఆ టెక్కీ రాజేశ్ ముఖం ఉద్వేగతంతో ఎర్రబారింది. వెంటనే పోలీసులు అతన్ని కోర్టు బయటకు తీసుకుని వెళ్లారు.

ఆ దారుణమైన హత్య 2010 ప్రాంతంలో ఉత్తరాఖండ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. భార్యతో గొడవ పడిన టెక్కీ రాజేశ్ అక్టోబర్ 17వ తేదీ రాత్రి భార్య అనుపమను చంపేశాడు.

ఇంట్లోనే హత్య....

ఇంట్లోనే హత్య....

భార్యతో కలిసి రాజేశ్ డెహ్రాడూన్ కంటోన్మెంట్‌ ప్రకాశ్ నగర్‌లో రెండు గదుల ఇంటిలో నివాసం ఉంటూ వచ్చాడు. 2010 అక్టోబర్ 17వ తేదీ రాత్రి రాజేశ్ తన భార్య అనుపమతో గొడవ పడ్డాడు. ఆ ఇంట్లోని రాజేశ్ ఆమెను హత్య చేశాడు కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పెళ్లి తర్వాత అమెరికాకు....

పెళ్లి తర్వాత అమెరికాకు....

రాజేశ్, అనుపమలు 1999లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆ తర్వాత 2008లో డెహ్రాడూన్‌కు తిరిగి వచ్చారు. డెహ్రాడూన్‌కు తిరిగి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య కలతలు చోటు చేసుకున్నారు. కోల్‌కత్తాకు చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని భర్తను అనుపమ పదే పదే నిలదీస్తూ వచ్చింది. దీంతో ఇరువురికి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.

ఆ రోజు ఇలా...

ఆ రోజు ఇలా...

అక్టోబర్ 17వ తేదీన కూడా ఇరువురికి మధ్య అదే విషయంపై గొడవ జరిగింది. కోపంతో రాజేశ్ అనుపమను పట్టుకుని తలను గోడకేసి కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె తెలివిలోకి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని భయంతో అతను దూదితో ముక్కు, నోటి నుంచి కారుతున్న రక్తాన్ని తుడిచేసి దిండుతో గొంతుపై అదిి పట్టి చంపేశాడు.

విద్యుత్ కత్తి కొని...

విద్యుత్ కత్తి కొని...

ఏ విధమైన ఆధారాలు లభించకుండా చేసే ఉద్దేశంతో రాజేశ్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కత్తి కొనుక్కుని వచ్చి ఆమె శరీరాన్ని 70 ముక్కలుగా నరికాడు. వాటిని పాలిథీన్ సంచుల్లో నింపాడు. మార్కెట్ నుంచి కొనుక్కుని వచ్చిన డీప్ ప్రీజర్‌లో వాటిని పెట్టాడు. ఆ తర్వాత ఒక్కో ఒక్కో పాలిథీన్ సంచీని బయటకు తెస్తూ ఒక్కో రోజు నగర శివార్లలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేస్తూ వెళ్లాడు.

రెండు నెలల పాటు....

రెండు నెలల పాటు....

రెండు నెలల పాటు రాజేశ్ అమాయకంగా ముఖం పెట్టి నటిస్తూ వచ్చాడు. తన కవలల పిల్లలద్దరికీ అమ్మ ఢిల్లీ వెళ్లిందని చెబుతూ వచ్చాడు. పిల్లల వయస్సు దాదాపు నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ఓ రోజు అనుపమ సోదరుడు ఇంటికి వచ్చాడు. ఎంతకీ అతనికి అనుపమ కనిపించలేదు. దాంతో రాజేశ్‌ను అడిగాడు.

పొంతనలేని జవాబులు

పొంతనలేని జవాబులు

అనుపమ గురించి ఆమె సోదరుడు అడిగినప్పుడు రాజేశ్ పొంతన లేని సమాధానాలు ఇస్తూ వచ్చాడు. అతన్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు. దాంతో అనుపమ సోదరుడు సుజన్ కుమార్ ప్రధాన్ తన సోదరి అనుపమ కనిపించడం లేదని డెహ్రాడూన్ కంటోన్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంట్లో సోదాలు చేసి...

ఇంట్లో సోదాలు చేసి...

అనుపమ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు రాజేశ్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో వారు అనుపమ శవం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనుపమ తలతో పాటు శవం ముక్కలు డీప్ ఫ్రీజర్‌లో ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో బాగంగా ముస్సోరీ- డెహ్రాడూన్ మార్గంలో పోలీసులు మరిన్ని శవం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Seven years after software engineer Rajesh Gulati smothered his 36-year-old wife and then used an electric saw to chop her body into 70 pieces, stashing the parts in a deep freezer for two months, a local court has held him guilty of murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X