కలికాలం : 80 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం..
మధుబని : కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద, ముసలి ముతకా తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఓ దారుణమే బీహార్‌లోని మధుబనిలో జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ టీనేజ్ బాలుడు 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
మధుబని జిల్లాలోని జమైలా గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధిత వృద్ధురాలికి దూరపు బంధువైన బాలుడు ఆమె ఇంటి సమీపంలోనే ఉంటాడు. బుధవారం అర్థరాత్రి దాటాక వారి ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు వృద్ధురాలు అరవకుండా ముందు నోట్లో గుడ్డలు కుక్కాడు. అనంతరం తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ రేప్ చేశాడు.

బాదితురాలి ఏడుపు, కేకలు వినిపించడంతో మరో గదిలో ఉన్న కుటుంబసభ్యులతో పాటు ఇంటి చుట్టుపక్కల వారు మేల్కొన్నారు. జరుగుతున్న దారుణాన్ని చూసి నిర్ఘాంతపోయారు. వృద్ధురాలిపై అఘాయిత్యం చేసిన నిందితున్ని పట్టుకున్న స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
నిందితుడు మైనర్ కాదని, అతని సర్టిఫికేట్లలో తప్పుడు వయసు ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుని వయసు తెలుసుకునేందుకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ప్రకటించారు. బాలున్ని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications