కడుపుతో ఉన్న అక్క.. బావపై మనసు పడ్డ చెల్లెలు.. అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఏం చేసిందంటే..
జబల్‌పూర్ : మధ్యప్రదేశ్‌లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. బావపై మనసుపడ్డ మరదలు అతన్ని దక్కించుకునేందుకు దారుణానికి పాల్పడింది. కడుపుతో ఉందన్న కనికరం లేకుండా అక్కను దారుణంగా పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేసిన తప్పు బయటపడటంతో చివరకు జైలు పాలైంది.

అక్కను చంపిన చెల్లెలు
జబల్‌పూర్‌లోని షాపూర్ నగర్‌కు చెందిన అభిలాషకు కొన్ని నెలల క్రితం పెళ్లైంది. గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చింది. అయితే అభిలాషకు టీనేజర్ అయిన శతాక్షి అనే చెల్లెలు ఉంది. శతాక్షి, అభిలాష భర్తపై ప్రేమ పెంచుకుంది. అక్కను అడ్డు తప్పిస్తే ఆమె భర్తను తాను పెళ్లి చేసుకోవచ్చని భావించింది. ఇందుకోసం పెద్ద స్కెచ్ వేసింది. అక్కను హత్య చేసేందుకు అదును కోసం వేచి చూసింది. శనివారం సాయంత్రం అభిలాష బాత్ రూంకు వెళ్లడంతో అదే అదునుగా శతాక్షి ఆమెపై దాడికి దిగింది. చాకుతో అభిలాష మెడతో పాటు పొట్టపై పలుమార్లు పొడిచింది. దీంతో పెద్ద కేకలు వేస్తూ ఆమె కుప్పకూలిపోయింది.

పారిపోయిన శతాక్షి
అభిలాష అరుపులు విన్న స్థానికులు ఇంట్లోకి వచ్చే చూసే సరికి ఆమె రక్తంతో తడిసిపోయింది. అప్రమత్తమైన చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్రగాయాలపాలైన అభిలాష కన్నుమూసింది. మరోవైపు స్థానికులు ఇంటికి చేరుకోవడంతో శతాక్షి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె ఆచూకీ గుర్తించారు. అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

బావ కోసం చంపానన్న శతాక్షి
పోలీసుల విచారణలో శతాక్షి దిమ్మదిరిగే నిజాలు బయటపెట్టింది. తన అక్క భర్తను ప్రేమిస్తున్నానని చెప్పింది. అభిలాష చనిపోతే ఆమె భర్తను తాను పెళ్లి చేసుకోవచ్చని అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పింది. అక్కను చంపేదుకు శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ప్రయత్నించినా సాధ్యం కాలేదని చివరకు సాయంత్రం అవకాశం దొరకడంతో హత్య చేసినట్లు చెప్పింది. నిందితురాలు ఉపయోగించిన కత్తితో పాటు ఆమె అప్పుడు వేసుకున్న డ్రెస్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ నరరూప రాక్షసిని కోర్టులో హాజరుపరచగా జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications