ఇన్ కమింగ్ కాల్స్ లో బిగ్ ఛేంజ్: ఇక దాగుడుమూతలకు కేంద్రం చెక్
తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు చెక్ పడింది. అజ్ఞాత వ్యక్తులు, సైబర్ మోసాలు, అడ్వర్టయిజ్మెంట్, బిజినెస్ ప్రమోషన్ కాల్స్ కు త్వరలోనే అడ్డుకట్ట పడనుంది. అన్ వాంటెడ్ కాల్స్ కు తెపడబోతోంది. ఇది మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది. కాల్స్ చేసేదెవరో తెలుసుకోవడానికి ఇక థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. వాటి అవసరం లేకుండానే ఫోన్ చేసినవారి అసలు పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈ విధానం నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. మొబైల్ ఫోన్లలో కాలర్ పేరు, నంబర్ డిస్ ప్లేను కేంద్రం తప్పనసరి చేసింది. ఈ మేరకు టెలికం ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే ఫోన్ చేసే వ్యక్తి అసలు పేరు ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఈ కాలర్ ఐడీ సేవలు డిఫాల్ట్
టెలికం శాఖ ఉత్తర్వుల ప్రకారం, 4జీ, 5జీ నెట్వర్క్ వినియోగదారులందరికీ ఈ కాలర్ ఐడీ సేవలు డిఫాల్ట్‌గా అందుబాటులోకి వస్తాయి. యూజర్లకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు.. స్క్రీన్‌పై ఉన్న మొదటి లైన్లో కాలర్ నంబర్, రెండో లైన్లో కాంటాక్ట్స్‌లో సేవ్ చేసిన పేరు కనిపిస్తుంది. ఒకవేళ ఆ నంబర్ సేవ్ చేసి లేకపోతే, టెలికాం ఆపరేటర్ కేవైసీ డేటాబేస్‌లో నమోదైన అధికారిక పేరు డిఫాల్ట్ గా ప్రత్యక్షమవుతుంది.
ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కూడా
ఇది ఇంటర్నేషనల్ కాల్స్ కు వర్తించదు. విదేశాల నుంచి కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ స్క్రీన్‌పై ఇంటర్నేషనల్ కాల్ అని మాత్రమే కనిపిస్తుంది. అలాగే కాలర్ లైన్ ఐడెంటిఫికేషన్ రెస్ట్రిక్షన్ సౌకర్యం పొందిన వినియోగదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపించవు. ఈ నూతన కాలర్ ఐడీ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కూడా తమ సబ్ స్క్రైబర్ పేరు, ఫోన్ నంబర్ ను అనుసంధానించడానికి ప్రత్యేకంగా ఓ డేటాబేస్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
వ్యక్తిగత వివరాల భద్రతకు అధిక ప్రాధాన్యత
యూజర్ల వ్యక్తిగత వివరాల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది. కాల్ పూర్తయిన వెంటనే ఆ పేరు వివరాలు సిస్టమ్ క్వెరీ రెస్పాన్స్ మెకానిజం నుంచి తొలగిపోయేలా సెక్యూరిటీ బై డిజైన్ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. బిజినెస్, బల్క్ కనెక్షన్లు కలిగిన సంస్థలకు నిబంధనల్లో ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.. కేంద్రం. ఇటువంటి సంస్థలు తమ సబ్ స్క్రైబర్ల రికార్డుల్లో ఉన్న పేరుకు బదులుగా తాము సూచించిన.. అంటే వ్యాపారం/ఏదైనా సంస్థ పేరు డిస్ ప్లే అయ్యేలా చేసుకోవచ్చు.
ల్యాండ్ లైన్ల కూ
ఇది ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీలో లేదా జీఎస్టీ పోర్టల్‌లో నమోదైన అధికారిక పేరు మాత్రమే అయి ఉండాలి. టెలికాం ఆపరేటర్లు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించిన తర్వాతే దీనికి అనుమతి ఇస్తాయి. ప్రస్తుతం ఉన్న బిజినెస్ సబ్ స్క్రైబర్లు తమ పేరును ఆపరేటర్ల వద్ద అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 4జీ, 5జీ నెట్‌వర్క్‌లలో ఈ విధానం అమలు కానుంది. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లతో పాటు ల్యాండ్‌లైన్ సేవలపై దీని అమలును తర్వాత విడతలో పరిశీలించనుంది కేంద్రం.














Click it and Unblock the Notifications
