కర్ణాటకలో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలవారు తమ ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నారు. కొందరు ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెబుతూ ఓట్లు అర్థిస్తున్నారు. తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన హాస్యనటుడు బ్రహ్మానందం కన్నడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతాపార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం బీజేపి అభ్యర్థి సుధాకర్ కి ఆయన మద్దతు పలికారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో సందడి చేశారు. వైద్య శాఖ మంత్రి Dr.కె.సుధాకర్ ను గెలిపించాలని ఆయన రోడ్డు మీద తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గ పరిధిలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో వారితో బ్రహ్మానందం తెలుగులో మాట్లాడి మెప్పించారు.

వైద్యశాఖలో డాక్టర్ సుధాకర్ ఎంతో సేవలందించారని, కర్ణాటక గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసిన సుధాకర్ కు ఓటు వేయాలని కోరారు. ఆయన మంచితనం, సేవలు చూసి తనలాంటివారు ఎందరో ఆయనకు అండగా నిలబడి గెలిపించడానికి వచ్చామని, అందరూ డాక్టర్ కు ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రసంగం తర్వాత ఖాన్ తో గేమ్స్ ఆడొద్దు.. అంటూ తనదైన స్టైల్ లో ప్రచారం ప్రారంభించారు. ఈరోజు రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసిన అనంతరం బ్రహ్మానందం హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
బ్రహ్మానందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వని బ్రహ్మానందం కర్ణాటక వెళ్లి బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేయడం ఏమిటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో కూడా డాక్టర్ సుధాకర్ ను గెలిపించాలని కోరుతూ బ్రహ్మీ ప్రచారం చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications