యూపీలో కరోనా పాజిటివ్‌ ఉన్న తబ్లిఘీ జమాత్ సభ్యుడి పరారీ... టెన్షన్ లో స్థానికులు

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌వద్ద తబ్లీఘీ జమాత్ మత ప్రచార సభ వ్యవహారం తెరపైకి రావటంతో వూహించని విధంగా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాదు ఈ మీటింగ్‌కు హాజరైన తబ్లిఘీ జమాత్ సభ్యులు అన్ని రాష్ట్రాల్లోని స్వగ్రామాలకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లడంతో వారు చాలా మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందటానికి కారణం అయ్యారు. ఇక వెళ్లిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ ఉండటం అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టెన్షన్ గా మారింది . అయితే అక్కడి వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతూ వారికి టెస్టులు నిర్వహిస్తూ ఎవరెవరు కరోనా బారిన పడ్డారో లెక్క తేలుస్తున్నారు . ఇక ఎవరికైనా ఏ అనుమానం ఉన్నా సమీప అధికారులకు వివరాలు చెబుతూ అవసరమైతే టెస్టులు నిర్వహించి ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే కరోనా పాజిటివ్ వచ్చినా సరే వీరిలో కొందరి సభ్యుల తీరు షాకింగ్ అనిపిస్తుంది .

ఇక తాజాగా యూపీలోని ఓ వ్యక్తి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ కు వెళ్ళి రావటంతో అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. యూపీ సర్కార్ అతనిని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తోంది . అయితే సోమవారం రాత్రి.. తన బట్టలను తాడుగా మార్చి ఆస్పత్రి వార్డులోని కిటికీని బద్దలు కొట్టి పారిపోయాడు సదరు వ్యక్తి . ఇక కరోనా పాజిటివ్ ఉన్న అతడి వయస్సు 60 ఏళ్లని తెలుస్తోంది. అంతేకాదు నేపాల్‌ నుంచి వచ్చిన 17 మంది సభ్యుల్లో పారిపోయిన వ్యక్తి కూడా ఒకడని చెప్తున్నారు అధికారులు .

Tension with the absconding of Tablighi Jamaat member with corona positive

శుక్రవారం బాఘ్‌పట్‌లో ప్రభుత్వాస్పత్రిలో చేరిన అతనికి ప్రస్తుతం కరోనా పాజిటివ్ అని తెలియటంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం సమీప గ్రామాల్లో గాలింపు చేపడుతున్నారు. ఇక అతను ఎంత మందికి కరోనా వ్యాప్తి అయ్యేలా చేస్తాడో అని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలులో రిమ్స్‌ ఐసొలేషన్‌ వార్డు నుంచి కరోనా లక్షణాలున్న యువకుడు తప్పించుకుపోవడం కూడా సంచలనం సృష్టించింది .తబ్లీఘీ జమాత్ మత ప్రచార సభకు వెళ్లి వచ్చిన యువకుడే కావటం గమనార్హం .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+