Terrorist: అక్తర్ మొబైల్ ఫోన్లలో బార్ కోడ్స్, ప్లాన్, టెలిగ్రామ్ సీక్రేట్ గ్రూప్, హైదరాబాద్, ఢిల్లీ ల్యాబ్ లో
బెంగళూరు/హైదరాబాద్: అమాయకులను టార్గెట్ చేసుకుని సున్నితమైన ప్రాంతాల్లో దాడులు చెయ్యాలని స్కెచ్ వేసిన ఆల్ ఖైదా అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు టెక్నికల్ ఆధారాలు, సాక్షాలు సంపాధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. ఆల్ ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నాడని బెంగళూరులో అరెస్టు అయిన అనుమానిత ఉగ్రవాది అక్తర్ మొబైల్ లోని పూర్తి సమాచారం సేకరించడానికి హైదరాబాద్, ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ ను సంప్రదించిన సీసీబీ పోలీసులు అందులోని పూర్తి డేటాను బయటకు లాగుతున్నారు.
Recommended Video


బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది అరెస్టు
బెంగళూరు నగరంలో అనుమానిత ఉగ్రవాది అక్తర్ మకాం వేశాడని, అతను ఉగ్రదాడులకు సిద్దం అవుతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. బెంగళూరులోని బోమ్మనహళ్ళిలో అనుమానిత ఉగ్రవాది అక్తర్ ను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అక్తర్ ఇంటిలోని కీలక ఆధారాలు సేకరించిన సీసీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు మొబైల్ ఫోన్లలో సీక్రేట్ బార్ కోడ్స్ ?
అనుమానిత ఉగ్రవాది అక్తర్ కు చెందిన రెండు మొబైల్ ఫోన్లు సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్తర్ మొబైల్ ఫోన్ లో 256 మందితో కూడిన ఓ టెలిగ్రామ్ గ్రూప్ ఉందని సీసీబీ పోలీసు అధికారులు అంటు్నారు. ఒక మొబైల్ ఫోన్ లో కోడ్ వర్డ్ తో కూడిన సమాచారం, ఓ ప్లాన్ ఉందని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

ఆల్ ఖైదాతో లింక్ !
ఆల్ ఖైదా అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు టెక్నికల్ ఆధారాలు, సాక్షాలు సంపాధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. ఆల్ ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నాడని బెంగళూరులో అరెస్టు అయిన అనుమానిత ఉగ్రవాది అక్తర్ రెండు మొబైల్ ఫోన్ల లోని పూర్తి సమాచారం సేకరించడానికి హైదరాబాద్, ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ ను సంప్రదించిన సీసీబీ పోలీసులు అందులోని పూర్తి డేటాను బయటకు లాగుతున్నారు.












Click it and Unblock the Notifications