ఆగస్ట్15 టార్గెట్ గా ఢిల్లీతోపాటు ప్రధాన నగరాల్లో భారీపేలుళ్లకు ఉగ్రకుట్ర; ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరిక!!
75 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా దేశంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం . ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రతి ఇంటి పై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా పేరుతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

పంద్రాగస్టు టార్గెట్ గా ఉగ్రదాడులు.. ఇంటిలిజన్స్ హెచ్చరికలు
ఎంతో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని భావిస్తున్న సమయంలో ఉగ్రమూక దాడుల హెచ్చరిక వచ్చింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారులు దేశంలోని రాష్ట్రాల రాజధానులతో సహా సున్నితమైన ప్రాంతాలలో ఉగ్రవాద సంస్థల నుండి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలు దాడులకు ప్లాన్
ఇంటెలిజెన్స్ అధికారులు దేశరాజధాని ఢిల్లీ , తెలంగాణ పోలీసులతో సహా అన్ని రాష్ట్రాలకు ఉగ్రవాద కదలికలపై సర్క్యులర్‌లు అందించారు. ఇటీవలి కాలంలో మతపరమైన అల్లర్లు జరిగిన సున్నితమైన ప్రదేశాలలో అదనపు బలగాలను మోహరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) తదితర తీవ్రవాద గ్రూపులు ఉగ్రదాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరిక జారీ చేసింది.

ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం చెయ్యాలని సూచన
లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ మరియు ఇతర ఉగ్రవాద గ్రూపుల నుండి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క 10 పేజీల నివేదిక పేర్కొంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రవేశ నిబంధనలను కఠినతరం చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దాడి, ఉదయపూర్, అమరావతిలో జరిగిన ఘటనలను నివేదికలో ప్రస్తావించారు. అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులను ఐబీ ఆదేశించింది. ఆగస్టు 15న వేదిక వద్దకు కఠినమైన ప్రవేశ నిబంధనలను అమలు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది.

పాక్ ఐఎస్ఐ ఉగ్రదాడులకు రెచ్చగొడుతోందని నివేదిక
జైషే, లష్కరే ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ మద్దతు ఇస్తూ పాక్ ఐఎస్ఐ ఉగ్రదాడులకు రెచ్చగొడుతోందని నివేదిక పేర్కొంది. పెద్ద నాయకులు మరియు ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవాలని జైష్ ఎ మొహమ్మద్ మరియు లష్కరే తోయిబాకి ఆదేశాలు అందుతున్నాయని పేర్కొంది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని సూచనలు చేసింది.
-
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
ట్రంప్‌కు తలనొప్పి.. పుతిన్‌కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications