వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆవు లెటర్ రాసింది: స్కూల్ లో పాఠాలు చెబుతున్నారు

|
Google Oneindia TeluguNews

జైపూర్: విద్యార్థుల చదువుకు రాజకీయ రంగు పడుతుంది. విద్యార్థులు సైతం రాజకీయ రంగు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. రాజకీయ పార్టీల నాయకుల భావజాల ప్రభావమో, వ్యక్తిగత ఉద్దేశమో తెలియదు కాని పిల్లలకు మాత్రం ఆవు లేఖ రాసిందని పాఠాలు చెప్పేస్తున్నారు.

రాజస్థాన్ తొలిసారి పాఠ్యంశాల్లో గోవు పేరిట ఓ లేఖను చేర్చి పాఠాలు చెబుతున్న తొలి రాష్ట్రంగా నిలిచింది. అందులో గోవు ఓ తల్లి మాదిరిగా విద్యార్థులకు లేఖ రాసినట్లు పాఠ్యాంశాన్ని చేర్చగా దానిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇది బీజేపీ ట్రిక్కు అంటూ విమర్శిస్తున్నారు. బీజేపీ తన హిందూత్వ భావాజాలన్ని పిల్లలపై రుద్దుతున్నారని, అందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతో చెప్పిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 Textbook have cow’s letter to kids in Rajasthan

రాజస్థాన్ లో ఐదో తరగతి హిందీ పుస్తకాల్లో ఓ చాప్టర్ లో రెండు ఆవుల ఫోటోలను ముద్రించారు. గోవును తన తల్లిగా పూజిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అందులో వివరించారు. ఇందులో గోవు సంభాషణ విద్యార్థులతో ఇలాగుంది. నాకుమారుల్లారా, నా కుతుర్లార నేను మీ ప్రతి ఒక్కరికి శక్తిని ఇస్తాను.

కావలసినంత తెలివి ఇస్తాను, సుధీర్ఘ ఆయుష్షు ఇస్తాను, నా గురించి ఎవరు ఎంత తెలుసుకుంటారో వారు కచ్చితంగా మంచి అనుభూతిని, ఆనందాన్నిపొందుతారు. ఎవరు నన్న తల్లిగా భావిస్తారో వారిని నేను సొంత బిడ్డలుగా భావిస్తాను. నేను పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇస్తాను.

నా మల మలమూత్రాలతో మెడిసన్ తో పాటు ఎరువులు తయారు చేస్తారు. నా సంతనమైన ఎద్దులు మీరు వ్యవసాయం చెయ్యడానికి ఉపయోగపడుతున్నాయి. నా వల్ల వాతవరణం స్వచ్ఛంగా మారిపోతుంది. అలాంటి నేను మీకు తల్లితో సమానం అంటూ లేఖలో గోవు వివరించిందని పఠ్యాంశాలు చెబుతున్నారు. అయితే గోవు నుంచి పొందే లాభాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ పాఠం పెట్టామని మంత్రి ఓతారామ్ దేవాసి సమర్థించుకుంటున్నారు.

English summary
Introduced in Hindi textbooks for class V students. The chapter has images of Hindu gods within a bigger picture of a cow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X