Thalapathy Vijay: రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంట్రీ త్వరలోనే.. పార్టీ పేరు ఇదే!!
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ క్రేజ్ తమిళనాట ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలాకాలంగా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న దళపతి విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయాల్లో అడుగు పెడతారని అందుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. అంతకు ముందే విజయ్ ట్రైలర్ గా లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెడతారని టాక్.
గత కొంతకాలంగా ఆయన అభిమానులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ తమిళనాడు రాజకీయాల బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న క్రమంలో, ఆయన తాజాగా అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమైంది. చాలాకాలంగా దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని వార్తలు హల్చల్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఆయన భార్య సంగీత, కుమారుడు జాసన్ సంజయ్ రాజకీయాలు వద్దని విజయ్ ను అడ్డుకుంటున్నారని కూడా ప్రచారం జరిగింది.

ఈ క్రమంలోనే భార్య సంగీత తో దళపతి విజయ్ కు కొంతకాలంగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయని కూడా తమిళనాడులో చర్చ జరుగుతుంది. ఇదిలాఉంటే రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెడుతున్న విజయ్ రాజకీయ ఆరంగేట్రం దాదాపు ఖరారైందని, 2026 శాసనసభ ఎన్నికలలో అమీ తుమీ తేల్చుకోవటానికి విజయ్ నిర్ణయించుకున్నాడని తాజాగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా తెలుస్తుంది.
2026 శాసనసభ ఎన్నికలకు ముందు ట్రైలర్ గా మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవాన్ని సంపాదించాలని విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. విజయ్ తన అభిమాన సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో తాజాగా మరోమారు చెన్నైలోని పనైయూర్ లో 150 మందితో సమావేశమైన విజయ్ అక్కడ పార్టీ పేరును, జెండా, అజెండా వంటి అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది.

తమిళనాడు ప్రజల అభివృద్ధి కలిసి ఉండేలా పార్టీ పేరును పెట్టాలని "తమిళ మున్నేట్ర కళగం" అనే పేరు పై విజయ్ మొగ్గు చూపినట్లుగా సమాచారం. ఇక ఇదే పేరుతో ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులకు మాత్రం ఇది శుభవార్తనే చెప్పాలి.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..! -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
హోం శాఖ లాగేసుకున్న బీజేపీ. సీఎం వద్దే 29 శాఖలు -
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH!












Click it and Unblock the Notifications