Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయ్ రూ. 250 కోట్ల భరణం?

దళపతి విజయ్.. కుటుంబ సమస్యల్లో చిక్కుకున్నారు. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం.. విడాకుల కోసం కోర్టుకెక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం అటు ఆయన పార్టీ టీవీకేను కూడా ప్రభావితం చేస్తోంది. మహిళల ఓటుబ్యాంక్ దెబ్బతినొచ్చనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. ఓ ప్రముఖ నటితో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆయన విడాకుల అంశం తాజాగా వార్తల్లో నిలిచింది. రాజకీయాల్లో అడుగు పెట్టినందున విజయ్ ఈ కేసును సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తన వైవాహిక సమస్యలను ఫ్యామిలీ కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని చూస్తున్నట్లు తమిళ ఫిల్మీబీట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కోర్టు వెలుపల సెటిల్‌మెంట్ చేసుకునే దిశగా వారి మధ్య చర్చలు జరిగాయని ఈ కథనం పేర్కొంది.

Thalapathy Vijay Eyes Out of Court Divorce Settlement Amid Controversy Reportedly Offers Rs 250 Crore

ఈ రాజీ ఒప్పందంలో భాగంగా విజయ్ సుమారు 250 కోట్ల రూపాయల మొత్తాన్ని భరణంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తమిళ ఫిల్మీబీట్ తెలిపింది. ఈ భారీ మొత్తం సంగీత, స్వర్ణలింగం, పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాలకు లభిస్తుందని అంచనా. ఈ మొత్తాన్ని ఎలా పంపిణీ చేస్తారనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. భరణం మొత్తం ఎంత అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

దీంతో పాటు ఇరుపక్షాలు పరస్పర అవగాహనకు వచ్చిన తర్వాత విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి, వ్యక్తిగత విషయాలు బయటపడకుండా ఉంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. విడాకుల విచారణ లేదా గతంలో పేర్కొన్న ఆరోపణలతో స్పందించడానికి విజయ్ సుముఖంగా లేరు. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటోన్నారు.

జాసన్ సంజయ్ 2000 ఆగస్టు 26వ తేదీన తమిళ సూపర్‌స్టార్ విజయ్, సంగీత స్వర్ణలింగం దంపతులకు జన్మించాడు. చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ (AISC)లో పాఠశాల విద్యను పూర్తిచేశాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి, టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను పొందాడు. ఆ తరువాత లండన్‌లో స్క్రీన్‌ రైటింగ్ కోర్సును అభ్యసించాడు. తన రచనా నైపుణ్యాలను మెరుగుపరచుకున్నాడు. అతనికి దివ్య సాషా అనే చెల్లెలు ఉంది. ఈ మొత్తం సంగీతతో పాటు వీరిద్దరికీ చెందొచ్చు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+