విజయ్ కు బిగ్ షాక్..

తమిళనాడు ప్రస్తుతం హాట్ హాట్ గా ఉంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, మరోవైపు టీవీకే అధినేత విజయ్ లేటెస్ట్ మూవీ జన నాయగన్ హెచ్ డీ ప్రింట్ లీక్ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఎప్పుడో ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన సినిమా అది. సెన్సార్ లో చిక్కుకుంది. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో హెచ్ డీ ప్రింట్ ఫుల్ మూవీ లీక్ కావడం చర్చనీయాంశమైంది.

అదే సమయంలో జన నాయగన్' అక్రమంగా ప్రసారం కావడంతో వివాదం చెలరేగింది. కోయంబత్తూరులో ఒక లోకల్ టీవీ ఛానెల్ దీన్నిటెలికాస్ట్ చేసింది. దీనిపై విజయ్ పార్టీకి చెందిన సభ్యుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు జిల్లా కరుమతంపట్టి రామ్ నగర్‌కు చెందిన ఎస్ పళనిసామి అనే ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్ తన రాశి ప్రైమ్ మూవీ ఛానెల్ లో ఈ నెల 11న ఈ చిత్రాన్ని ప్రసారం చేశాడు.

Thalapathy Vijay Jana Nayagan Illegally Telecast in Local Cable TV Channel in Coimbatore Tamil Nadu

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రాకుండానే సినిమా టెలికాస్ట్ కావడం అక్రమం. దీంతో టీవీకే కోయంబత్తూరు ఈస్ట్ యూనిట్ డిప్యూటీ సెక్రటరీ మోహనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనట్లు తెలిసిన వెంటనే నిందితుడు పళనిస్వామి పరారయ్యాడు. సినిమా ఇంకా సర్టిఫికెట్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, దానిని అక్రమంగా యాక్సెస్ చేసి ఛానెల్ ద్వారా ప్రజలకు ప్రసారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

అతని కోసం కోయంబత్తూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కే కార్తికేయన్ రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం జ్యుడీషియల్ కస్టడీ తరలించారు. ఈ అక్రమ ప్రసారానికి ఉపయోగించిన కంప్యూటర్, అయిదు హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా పలు వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఛానెల్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు.

కేబుల్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సినిమాతో పాటు ఇతర కాపీరైట్ కంటెంట్‌ను అక్రమంగా పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అధికారులు దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఏప్రిల్ 9న జన నాయగన్ చిత్రానికి సంబంధించిన కొన్ని క్లిప్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. పూర్తి హెచ్ డీ ప్రింట్‌ బయటికొచ్చింది. అభిమానులు, చిత్ర బృందానికి షాక్ ఇస్తూ, ఈ క్లిప్‌లు, పైరేటెడ్ లింక్‌లు అనేక ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా సర్క్యులేట్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+