Thalapathy Vijay: రాజకీయపార్టీ ప్రకటించిన దళపతి విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు పక్కా!!
ఎప్పుడెప్పుడా అని హీరో విజయ్ పొలిటికల్ అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు దళపతి విజయ్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన పార్టీ పేరును కూడా అధికారికంగా ప్రకటించేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ తాను రాజకీయాల్లోకి రావటం వెనుక కారణాన్ని చెప్పారు.
Recommended Video

ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతుందని, దానిపై పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బరిలోకి దిగుతామని వెల్లడించారు. ఇక పొలిటికల్ పార్టీ పెట్టిన విజయ్ ఆ పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడేనా? ఒక పార్టీని నడిపించాలంటే భారీగా డబ్బులు ఖర్చుపెట్టాలి? అన్ని డబ్బులు హీరో విజయ్ వద్ద ఉన్నాయా? అసలు విజయ్ ఆస్తులు ఎన్ని? అన్న చర్చ ప్రస్తుతం ప్రధానంగా జరుగుతుంది.

సినిమాలలో సక్సెస్ అయిన దళపతి విజయ్ భారీగానే ఆస్తులు కూడా పెట్టాడని చెబుతున్నారు. గూగుల్లో వివిధ కథనాల ప్రకారం 2023 జనవరి 1 నాటికి విజయ్ స్థిరాస్తులు 445 కోట్లు ఉన్నాయని భోగట్టా. విజయ్ కి సంబంధించి ఇళ్ళు, స్థలాలు, పొలాలు, భవనాలు ఇలా స్థిరాస్తి గా ఆయన ఇన్కమ్ టాక్స్ అధికారులకు చూపించింది 445 కోట్ల రూపాయలని తెలుస్తుంది.
అయితే ఇది గవర్నమెంట్ ధర ప్రకారం అని, వీటి మార్కెట్ వాల్యూ ఐదారొంతులు ఉండవచ్చని సమాచారం. ఈ లెక్కన చూస్తే విజయ్ వేలకోట్ల రూపాయలను సంపాదించారని, ఆ డబ్బు రాజకీయాలు చేయడానికి, పొలిటికల్ పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి పనికొస్తుందని ఒక అంచనా. నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికి, అవినీతిరహిత రాజకీయం చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన విజయ్ అందుకు తగ్గట్టు ఆర్థికంగా బలంగానే ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
#தமிழகவெற்றிகழகம் #TVKVijay https://t.co/Szf7Kdnyvr
— Vijay (@actorvijay) February 2, 2024
తన కెరీర్లో మొత్తం ఇప్పటివరకు 61చిత్రాలలో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నారు. దేశ విదేశాలలో భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరో విజయ్ అని చెబుతారు. విజయ్ తాను నటించిన బీస్ట్ సినిమాకు 100 కోట్లు తీసుకున్నట్టు టాక్. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
-
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
ప్రతి నెలా రూ. 3,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు -
West Bengal: బీజేపీతో బంధం బట్టబయలు-ముస్లిం పార్టీతో ఎంఐఎం కటాఫ్..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్












Click it and Unblock the Notifications