శశికళను కలిసిన మన్నార్ గుడి మాఫియా, తంబిదురై, ఎమ్మెల్యేలు క్యూ: ఎందుకంటే ?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మంగళవారం ములాఖత్ లో బిజిబిజీగా గడిపారు. మన్నార్ గుడి మాఫియా సభ్యులు శశికళను కలిసి మాట్లాడారు.

ఆంధ్రా దెబ్బకు తమిళనాడు హడల్: పగ, ప్రైవేట్ పాల పంచాయితీ, నాణ్యత లేదు, ప్రాణహాని !

అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్, ఆయన భార్య అనురాధ, జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ సోదరుడి కుమార్తె భర్త డాక్టర్ వెంకటేష్ కలిశారు. శశికళతో రెండు గంటలపాటు వీరు మాట్లాడారు.

Thambidurai meets Sasikala in the Bengaluru prison.

రాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా మన వర్గం ఎవరికి మద్దతు ఇవ్వాలి ? అనే విషయంపై దినకరన్ శశికళతో చర్చించారని అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకులు చెప్పారు. అయితే ఈ విషయం దినకరన్ మాత్రం ఏలాంటి వివరణ ఇవ్వలేదు. అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఐదు మంది ఎమ్మెల్యేలు సైతం శశికళను కలిశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటి కస్తూరి భేటీ: రాజకీయాల్లో ఎంట్రీ, ఎవ్వరూ పట్టించుకోలేదని !

మరో వైపు లోక్ సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై మంగళవారం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని శశికళతో మాట్లాడారు. తంబిదురై సైతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయంపై శశికళతో చర్చించారని వారి వర్గంలోని ఎంపీలు అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి ? అనే విషయంలో శశికళ ఓ క్లారిటీ ఇచ్చారని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thambidurai meets Sasikala in the Bengaluru prison. He may discussed about the Presidential election support. TTV. Dinakaran, Anuradha and Dr.Venkatesh met Sasikala today at Bangalore prison and the minutes of the meeting would be about the support of AIADMK in President elections.
Please Wait while comments are loading...