ఫ్యామ్ హౌస్ లో ఒంటరి మహిళ, భర్త వచ్చేలోపు ఏం జరిగిందంటే ?, కొడవలితో దాడి చేసి జంప్ !
పొలంలో పని చేస్తున్న మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకా కొత్త కడజట్టి గ్రామంలో చోటుచేసుకుంది. వివాహిత మహిళపై నవీన్ అనే నిందితుడు అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నించాడని, అడ్డుపడిన మహిళ భర్తను కూడా అతను చంపడానికి ప్రయత్నించాడని కేసు నమోదు అయ్యింది.
పొలంలో పని చేస్తున్న వివాహిత మహిళపై అత్యాచారయత్నానికి నవీన్ అనే వ్యక్తి ప్రయత్నించడంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో మహిళ కేకలు వినిన భర్త మహదేవప్ప అక్కడికి పరుగుతీశాడు. భార్యపై అత్యాచారానికి ప్రయత్నించిన నవీన్ ను అడ్డుకున్న భర్త మహదేవప్ప భార్యను రక్షించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో నిందితుడు నవీన్ మహిళ భర్త మహదేవప్పపై కొడవలితో దాడి చేసి తప్పించుకునిపారిపోయాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన నవీన్ ఫామ్ హౌస్ కంచె దూకి మహదేవప్ప ఇంట్లోకి వెళ్లి అతని భార్య నోటిలో గుడ్డ బిగించి అత్యాచారానికి యత్నించింది. ఈ సమయంలో మహదేవప్ప భార్య నోటిలో గుడ్డ లాగేసి గట్టిగా కేకలు వేసింది. భార్య అరుపులు విన్న మహదేవప్ప అతను కూడా కేకలు వేస్తూ ఇతరుల సహాయం కోసం ప్రయత్నించాడు. తరువాత పరుగున ఫామ్ హౌస్ లోని ఇంటికి వెళ్లిన మహదేవప్ప అతని భార్యను రక్షించుకున్నాడు.
ఆ సమయంలో కామాంధుడు నవీన్ మహిళ భర్త మహదేవప్ప మీద కొడవలితో దాడి చేసి అక్కడి ఫామ్ హౌస్ కంచె దూకి పారిపోయాడు. కొడవలితో దాడి చెయ్యడంతో తీవ్రంగా గాయపడిన మహదేవప్పను నంజనగూడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే హుల్లహళ్లి పోలీస్‌స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications