ట్యూషన్ కు వెళ్లిన అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అమ్మాయి ఏం చేసిందంటే ?
బెంగళూరు/బెళగావి: బాలికను కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించిన కేసులో ఓ వ్యక్తిని కర్ణాటకలోని బెళగావి సిటీ పోలీసులు అరెస్టు చేశారు. బెళగావిలోని మాలమారుతి నగర్‌కు చెందిన గజానన పాటిల్ అలియాస్ పాటిల్ (35)ను అరెస్టు చేశారు. మంగళవారం సాయంత్రం బెళగావి నగరంలోని హిందవాడీ ప్రాంతంలోని పోస్టాఫీసు సమీపంలో ట్యూషన్‌కు వెళ్తున్న 9 ఏళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని పాటిల్ ప్రలోభపెట్టాడు.
అనంతరం బాలికను అపహరించుకువెళ్లాలనే ఉద్దేశంతో బాలికను భుజాలపై వేసుకుని పరిగెత్తుతుండగా బాలిక అతడిని కొట్టింది. తర్వాత ఆమె కేకలు వేసింది. బాలిక గొంతు విని స్థానికులు పాటిల్ ను వెంబడించారు. బాలికను అక్కడే వదిలిసిన పాటిల్ అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక అపహరణ చేస్తున్న దృశ్యం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ భవనంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

బాలిక అపహరణకు యత్నించారనే వార్త నగరంలో వైరల్‌గా మారడంతో నగరవాసులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. అత్యాచార యత్నంపై బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తిలకవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన బెళగావి పోలీసు అధికారులు వెంటనే ఉజయబాగ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామన్న బిరాదార నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోని ప్రతి అధికారి, సిబ్బందికి సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు నగరంలోని వీధుల్లో సోదాలు నిర్వహించారు.

ఈ కేసులో అపహరణకు ప్రయత్నించిన వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని, లేదంటే పొరుగున ఉన్న గోవా లేదా మహారాష్ట్రకు చెందినవాడు అయి ఉంటాడని పోలీసులు మొదట అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన 12 గంటల్లోనే నిందితుడు పాటిల్ ను అరెస్ట్ చేశారు. గజానన పాటిల్‌ను ఉజయబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి ఖడేబజార్ ఏసీపీ అరుణ్‌కుమార్ విచారణ అధికారి రామన్న బిరాదార విచారణ చేపట్టారు.
తాను బెళగావిలోని మాలమారుతి నగర్‌లో నివాసముంటున్నానని పాటిల్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం డీసీపీ శేఖర్ ఉజయబాగ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సమయంలో అమ్మాయి అందంగా ఉన్నందునే ఆమెను ఎత్తుకునిపారిపోవాలని ప్రయత్నించానని పాటిల్ చెప్పాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications