పొట్టి గౌను వేసుకున్న పెద్దపాపకు నో ఎంట్రీ
ముంబై: పొట్టి దుస్తులు వేసుకుందని ఓ మహిళా ప్రయాణికురాలికి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైయ్యింది. ఆమెకు విమానం మిస్ కావడంతో వేరే విమానంలో ముంబై నగరం నుంచి న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఓ మహిళ ఫ్రాక్ వేసుకుని ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో దోహా నుంచి ముంబై చేరుకుంది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం (ఇండిగో) ఎక్కాల్సి ఉంది. ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరడానికి ఇండిగో విమానం సిద్దంగా ఉంది. ఆ మహిళా ప్రయాణికురాలు ఇండిగో విమానం ఎక్కారు.
అయితే ఆమె ఫ్రాక్ వేసుకుందని, ఇంతటి పొట్టి దుస్తులు వేసుకుంటే తమ విమానంలో ప్రయాణించడానికి అనుమతిఇవ్వమని ఇండిగో సిబ్బంది చెప్పారు. ఆమెను ఆ విమానం నుంచి కిందకు దించివేశారు.

అదే విమానంలో ఉన్న సాటి మహిళా ప్రయాణికురాలు పురభి దాస్ ఈ సంఘటన వివరాలను తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఆ మహిళ పట్ల ఇండిగో విమానం పురుష సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారని విచారం వ్యక్తం చేశారు.
ఆమె మోకాళ్ల వరకు ఫ్రాక్ వేసుకుందని, అంత అసభ్యంగా ఏమి లేదని, అదే విమానంలోని పురుష సిబ్బందికి అంత అభ్యంతరకరంగా ఎందుకు కనిపించిందో అర్థం కాలేదని అన్నారు. అదే సంస్థలో పని చేస్తున్న ఎయిర్ హోస్టులు మాత్రం మోకాళ్ల వరకు ఫ్రాక్ లు వేసుకున్నారని గుర్తు చేశారు.
ఈ విషయంపై పురభి దాస్ ఇండిగో సంస్థ కస్టమర్ కేర్ ను సంప్రదించారు. ఫ్రాక్ లు వేసుకుంటే తమ విమానాలలో ప్రయాణించడానికి తాము అనుమతి ఇవ్వమని వారు చెప్పారని పురభి దాస్ వివరించారు. చివరికి ఆమె విమానం మిస్ అయ్యింది.
దుస్తులు మార్చుకున్న తరువాత ఆమె వేరే విమానంలో ఢిల్లీ చేరుకున్నారని పురభి దాస్ వివరించారు. విమానం నుంచి కిందకు దించేసిన ఆ మహిళా ప్రయాణికురాలు అదే ఇండిగో సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి సోదరి అని పురభి దాస్ వివరించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications