కేరళ మొత్తం కదిలినా.. ఆమె దక్కలేదు: తీరని శోకం నింపిన చిన్నారి ‘దేవానంద’

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలో వందలాది మంది ఆ చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. వేలాది మంది సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను షేర్ చేస్తూ ఆమె ఆచూకీ కోసం శ్రమించారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ తల్లిదండ్రులతోపాటు వేలాది మంది చేసిన ప్రార్థనలు ఫలించలేదు. చివరకు ఆరేళ్ల చిన్నారి దేవానంద విగతజీవిగా సరస్సులో లభ్యం కావడం వారందిరిలో తీరని వేదననే నింపింది.

ఆ దంపతులు ముద్దుల కూతురు..

ఆ దంపతులు ముద్దుల కూతురు..

కొల్లాం జిల్లాలోని ఎలవూరుకు చెందిన ప్రదీప్ కుమార్-ధన్య దంపతుల ముద్దుల కూతురే ఈ దేవానంద. ఆమెను ముద్దుగా పొన్ను అని పిలుచుకుంటారు ఈ దంపతులు. ఎంతో గారాభంగా చూసుకుంటున్నారు. కాగా, గురువారం ఉదయం నుంచి దేవానంద కనిపించలేదు. దీంతో ఆ దంపతులు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా వెదికారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు అందరికీ సమాచారం అందించారు. సోషల్ మీడియాలో కూడా ఫొటోలను షేర్ చేసి ఆచూకీ కోసం ప్రయత్నించారు.

గురువారం ఉదయం అదృశ్యం..

గురువారం ఉదయం అదృశ్యం..

తమ ఇంటి సమీపంలోనే బట్టలు ఉతికేందుకు వెళ్లింది దేవానంద తల్లి ధన్య. ఆమెతోపాటే దేవానంద కూడా వెళ్లింది. దీంతో, దేవానందను ఇంటి దగ్గర ఉండమని చెప్పడంతో ఆమె వెళ్లిపోయింది. అయితే, ఇంటి దగ్గరికి వెళ్లి చూడటంతో దేవానంద కనిపించలేదు. గురువారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని ధన్య మీడియాకు తెలిపారు. తన కూతురు వేరేవాళ్ల ఇంటికి వెళ్లి ఆడుకోదని, తమ ఇంట్లోనే ఆడుకుంటుందని.. అయితే, ఎక్కడికెళ్లిందో తెలియడం లేదని చిన్నారి తల్లి ధన్య ఆవేదన వ్యక్తం చేసింది.

తండ్రి గుండె బద్దలైంది..

తండ్రి గుండె బద్దలైంది..


చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో వారంతా కూడా దేవానంద కోసం గాలింపు చేపట్టారు. సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా విస్తృతంగా గాలించారు. చిన్నారి ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. తన కూతురు అదృశ్యమైందన్న సమాచారంతో ప్రదీప్ విదేశాల నుంచి సొంత గ్రామానికి బయల్దేరాడు. అతను చేరుకునే సరికే తన కూతురు మరణించిందనే విషయం తెలిసింది. దీంతో ఆ తండ్రికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కన్నీళ్లపర్యంతమవుతూనే ఆ చిన్నారి మృతదేహం వద్దకు చేరుకున్నారు ప్రదీప్. దేవానంద మృతి ప్రదీప్-ధన్య దంపతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అక్కడున్నవారంతా విషాదంలో మునిగిపోయారు.

చిన్నారి కోసం కదిలిన కేరళ..

చిన్నారి కోసం కదిలిన కేరళ..

చిన్నారి ఆచూకీ కోసం కొల్లాం జిల్లాతోపాటు కేరళ వ్యాప్తంగా నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను షేర్ చేశారు. పలువురు ప్రముఖులు కూడా దేవానంద ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మొత్తం గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇథిక్కల్ సరస్సులో దేవానంద మృతదేహం లభ్యమైంది. బురదలో విగతజీవిగా పడివున్న చిన్నారిని పోలీసులు బయటికి తీశారు. ఆమే దేవానందగా గుర్తించారు స్థానిక సీఐ విపిన్ కుమార్.

చిన్నారి వెంట్రుకలు చిక్కుకోవడంతో..

చిన్నారి వెంట్రుకలు చిక్కుకోవడంతో..

ఈ సరస్సు చిన్నారి ఇంటికి సుమారు 700 మీటర్లో దూరంలోనే ఉంది. సరస్సులోని ఓ చెట్టుకు చిన్నారి వెంట్రుకలు చిక్కుకోవడంతో అక్కడే మృతదేహం పడివుంది. బ్రౌన్ రంగుతో కూడిన ఓ దుప్పట్ట కూడా ఆమె సమీపంలో దొరికిందని సైంటిఫిక్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఇది ఆ చిన్నారిది లేక లేక ఆమె తల్లిది కావొచ్చని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం ఆ చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు ఆ చిన్నారి సరస్సులో పడి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+