టిక్ టాక్ స్టార్ తో ఎంజాయ్, విషంతో ప్రియురాలిని ?, చచ్చినా ఆమెను వదల్లేదు !
బెంగళూరు: యువతి, యువకుడికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది, యువతి, యువకుడు టిక్ టాక్ లో కూడా వీడియోలు చేశారు. టిక్ టాక్ చేసిన యువతి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది. చూడటానికి సినిమా హీరోయిన్ లా ఉండే యువతిని ఓ యువకుడు వలలో వేసుకున్నాడు. ప్రేమించిన యువకుడే ప్రియురాలికి విషం తెచ్చి ఇచ్చి ఆమెను చంపేయడం కలకలం రేపింది. ప్రియురాలు చచ్చినా ఆమెను ప్రియుడు వదల్లేదు.
బెంగళూరులో అబ్రార్ అనే యువకుడు, ముస్కాన్ అనే యువతి నివాసం ఉంటున్నారు. టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న ముస్కాన్ కు, అబ్రార్ కు ఇన్‌స్టా ద్వారా పరిచయం అయ్యింది. రానురాను అబ్రార్, ముస్కాల పరిచయం ప్రేమకు దారితీసింది. తరువాత ప్రేమికులు బెంగళూరులోని మూలమూలల్లో తిరిగి ఎంజాయ్ చేశారు.

ఇలా తిరుగుతూ గత 5 సంవత్సరాల నుంచి ఇద్దరూ శారీరకంగా కలిసి ఎంజాయ్ చేశారు. మనం పెళ్లి చేసుకుందామని ముస్కాన్ ఆమె ప్రియుడు అబ్రార్ మీద ఒత్తిడి చేసింది. పెళ్లి విషయంపై చర్చ జరిగిన ప్రతిసారి ప్రియుడు అబ్రార్ నెమ్మదిగా జారుకోవడం ప్రారంభించాడు. రానురాను ప్రియురాలు ముస్కామ్ ను దూరం పెట్టడానికి అబ్రార్ ప్రయత్నించాడు. చివరకు ప్రియురాలు ముస్కాన్ వద్దు అని అబ్రార్ నిర్ణయించుకున్నాడు.
ప్రియుడు అబ్రార్ పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పడంతో తాను విషం తాగుతానని ప్రియురాలు ముస్కాన్ ఆమె ప్రియుడు అబ్రార్ ను బెదిరించింది. కావాలంటే నేను నీకు ఎలుకల మందు తెచ్చి ఇస్తానని, నవ్వు చచ్చిపోతే నేను హ్యాపీగా ఉంటానని అబ్రార్ అతని ప్రియురాలికి చెప్పాడు. రానురాను అబ్రార్ ఆమె ప్రియురాలిని ద్వేషించడం మొదలుపెట్టాడు.
నువ్వు విషం తీసుకురావాలని, ఆ విషం తాగి నేను చచ్చిపోతానని ముస్కాన్ ఆమె ప్రియుడు అబ్రార్ కు చెప్పి అతన్ని బెదిరించడానికి ప్రయత్నించింది. దుకాణంలోకి వెళ్లిన అబ్రార్ ఎలుకల మందు బాటిల్ తీసుకొని వెళ్లి అతని ప్రియురాలు ముస్కాన్ కు ఇచ్చాడు. నువ్వు చచ్చినా నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పిన ప్రేమికుడు అబ్రార్ అతని ప్రియురాలు ముస్కాన్ చేతికి విషం ఇచ్చాడు.

నేను వద్దు అని తన ప్రియుడు చీదరించుకుంటున్నాడని, ఇక నేను ఎందుకు బతకాలి అనుకున్న ముస్కాన్ ఆమె ప్రియుడు తెచ్చిన విషం తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ముస్కాన్ ను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆసుపత్రిలో చావుతో పోరాటం చేసిన ముస్కాన్ చివరికి చనిపోయింది.
విషం తాగి ప్రియురాలు ముస్కాన్ చనిపోయిందని తెలుసుకున్న ఆమె ప్రియుడు అబ్రార్ తర్వాత కూడా ఆమెను వదల్లేదు. ముస్కాన్ మరణానికి కారణం అయిన అబ్రార్ చివరికి ఆసుపత్రికి వెళ్లి ఆమె మొబైల్ ఫోన్ దొంగిలించాడు. తర్వాత వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు, చాట్‌లు అన్నీ ముస్కాన్ మొబైల్ లో డిలీట్ చేసిన అబ్రార్ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడని పోలీసులు అన్నారు.
.












Click it and Unblock the Notifications