Marriage: బట్ట తల దాచి వివాహానికి సిద్ధమైన పెళ్లి కొడుకు.. విగ్గు తీసి చితకబాదిని బంధువులు..
ఒక్కప్పుడు చాలా మందికి చనిపోయ వరకు వెంట్రుకలు ఊడిపోయేవి కావు.. అప్పట్లు బట్ట తల ఉన్నవారు ఎవరో ఒకరు ఉండే వారు.. కానీ ఇప్పుడు చాలా మంది బట్ట తలతో కనిపిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా బట్ట తల వస్తుంది. ఇక తెల్ల వెంట్రుకలు కూడా ఒకప్పుడు వృద్ధప్యంలో వచ్చేవి.. కానీ ఇప్పుడు 15 ఏళ్ల వయస్సులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. తెల్ల వెంట్రకలు ఉంటే కలర్ వేసి కవర్ చేయ్యొచ్చు.. కానీ బట్ట తల ఎల కవర్ చేస్తారు.
డబ్బున్న వారైతే హెయిర్స్ ప్లాంటేషన్ చేసుకుంటారు. మరి డబ్బులేని వారు విగ్గు వాడతారు. అయితే ఇలా ఓ వ్యక్తి బట్ట తల దాటి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. చివరికి అతనికి బట్ట తల ఉందని తెలిసి వధువు బంధువులు అతడిని చితకబాదారు. ఈ ఘటన బిహార్ లోని గయాలో జరిగింది. బజౌరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పెళ్లయింది. అతను భార్యతో దూరంగా ఉంటున్నాడు. దీంతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

బ్రోకర్ తో ఓ సంబంధం మాట్లాడుకున్నాడు. అయితే తనకు బట్ట తల ఉన్న విషయాన్ని పెళ్లి కూతురుకు చెప్పలేదు. విగ్ తో బట్ట తలను కవర్ చేశాడు. పెళ్లి రోజు కూడా విగ్ తో మండపంలోకి వచ్చాడు. అతని క్రాఫ్ చూసి వధువు బంధువులకు అనుమానం వచ్చింది. వారు అతడిని పరిక్షించగా.. అది విగ్ అని అర్థం అయింది. విషయం తెలుసుకున్న వధువు పెళ్లి చేసుకోవాడనికి నిరాకరించింది.
మరోవైపు పెళ్లి కూతరు బంధువులు ఆగ్రహంతో పెళ్లి కొడుకును చితకబాదారు. విగ్గు లాగేసి కొట్టారు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని అక్కడి చేరుకున్న మొదటి భార్య భర్తను కొడుతున్న దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications