కర్ణాటకకు మైండ్ బ్లాక్, తమిళనాడుకు అప్పుడే దీపావళి వచ్చేసింది, అంతేగా !

బెంగళూరు: కావేరి నీటి పంపకాల సమస్యపై కర్ణాటకలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ తమిళనాడుకు తిరిగి నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ ఆదేశించింది. కావేరి వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వానికి మళ్లీ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు 2, 600 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ నియంత్రణ మండలి బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయంలో కావేరీ జలాల కోసం కావేరి వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు అథారిటీకి వెళ్లిన కర్ణాటక ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే కర్ణాటకలో వర్షాలు కురవకపోవడంతో పలు రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీంతో మళ్లీ మళ్లీ కావేరి జలాల విషయంలో కర్ణాటకకు ఎదురుదెబ్బలు తగులుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం మళ్లీ కష్టాల్లో కూరుకుపోయినట్లు అయ్యింది.

The Cauvery Water Management Authority Board issued orders to release 2,600 cusecs of water to Tamil Nadu.

తమిళనాడుకు 2, 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సమావేశం అనంతరం ఏసీఎస్ రాకేష్ సింగ్ మాట్లాడుతూ నవంబర్ 23వ తేదీ వరకు 2, 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికార యంత్రాంగం ఆదేశించినట్లు తెలిపారు. 13 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తమిళనాడు కోరిందని తెలిపారు.

The Cauvery Water Management Authority Board issued orders to release 2,600 cusecs of water to Tamil Nadu.

కావేరి జలాల పంపిణి కోసం కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వం పదేపదే పోట్లాడుకుంటున్నాయి. అయితే కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత కావేరి జాలల పంపిణి విషయంలో కర్ణాటకకు పదేపదే ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం కావేరి జలాల కోసం ఫైట్ చేస్తుంటే సిద్దరామయ్య ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని, కర్ణాటక రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని, బెంగళూరు ప్రజలకు తాగునీరు కూడా చిక్కకుండా పోయే అవకాశం ఉందని పలువురు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+