సెక్స్ స్కాండల్ కేసు, మాజీ మంత్రికి జైలు, ఎంపీ ఎస్కేప్ తో కేసులో మలుపు!
కర్ణాటకలోని హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు విడుదల అయిన తరువాత విదేశాలకు వెళ్లారో, లేకుంటే వీడియోలు విడుదల అయిన తరువాత ఆయన విదేశాలకు వెళ్లారో అనే విషయంలో క్లారిటీ లేకపోయినా ఆయన మాత్రం ఎవ్వరికంట పడకుండా తప్పించుకని తిరుగుతుతున్నారు.
హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల దెబ్బకు ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ లేనిపోని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హలేనరసీపుర సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం కూడా ఇప్పుడు ఆ కేసు హాట్ టాపిక్ అయ్యింది. ప్రజ్వల్ రేవణ్ణ కేసు వ్యవహారంలోనే ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణ అనేక ఇబ్బందులకు గురి అయ్యారు. ఇప్పటికే మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు.

మహిళను కిడ్నాప్ చేసిన కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయన మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఈ కేసులో మాజీ మంత్రి రేవణ్ణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించిన బెంగళూరులోని 17వ ఏసీఎంఎం కోర్టు నిందితుడిని మే 14వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణను బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణను సిట్ బృందం పరప్ప అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించాలని డిసైడ్ అయ్యారు. మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి రేవణ్ణ మీద కిడ్నాప్ కేసు నమోదైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
హాసన్‌లో అసభ్యకరమైన వీడియో విడుదల కావడంతో తన తల్లి కనిపించకుండా పోయిందని 20 ఏళ్ల యువకుడు కేఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో రెండో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ భార్య భవాని రేవణ్ణ బంధువు సతీష్‌బాబును సిట్ ఇటీవల అరెస్టు చేసింది. అనంతరం ఈ కేసులో మొదటి నిందితుడు, మాజీ మంత్రి, హలేనరసీపుర జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications