Oscars 2023: భారత్ కు ఆస్కార్ - దుమ్ము రేపిన నాటు నాటు లైవ్ పెర్ఫామెన్స్..!!
అస్కార్ అవార్డుల్లో భారతీయ చిత్రానికి పురస్కారం దక్కింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ అవార్డు అవతార్ కు దక్కింది.
ది వే ఆఫ్ వాటర్ సినిమాకు అవార్డు ప్రకటించారు. కుట్టునాయకన్ అనే గిరిజన ఫ్యామిలీలో కలిసి పెరిగిన ఏనుగు కథ ది ఎలిఫెంట్ విష్పరర్స్ . ఐదేళ్ల పాటు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ సాగింది. ఈ డాక్యెమెంటరీని కార్తికీ గాన్‌స్లేవ్స్, గునీత్ మోంగా తెరకెక్కించారు. ఈ అవార్డ్ కోసం హౌలౌట్, హౌ డు యు మెజర్ ఏ ఇయర్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ నామినేట్ కాగా.. భారత్ నుంచి ఎంపికైనా ది ఎలిఫెంట్ విస్పరర్స్ విజేతగా నిలిచింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్' చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.
లైవ్ లో నాటు నాటు పాట
ఇక...ఆస్కార్ వేదికలో నాటు నాటు పాట మోత పుట్టిస్తోంది. వేడుక ప్రారంభంలోనే యాంకర్లు ముందుగా ఈ పాటకు వేదిక పైన డాన్స్ చేసారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. హాలీవుడ్ డ్యాన్సర్స్ వెస్టర్స్ డాన్స్ తో మెప్పించారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. అక్కడున్నవారంత నాటు నాటు పాట పెర్ఫామెన్స్ కు లైవ్ ఓవియేషన్ ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచింది.
వేడుకల్లో దుమ్ము రేపుతున్న ఆర్ఆర్ఆర్
అయిదు పాటలతో నాటు నాటు సాంగ్ పోటీ పడుతోంది. ఈ వేడుక కోసం వచ్చిన ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ సూట్‌లో సందడి చేశాడు. బెస్ట్ ఒరిజినల్ పాటలో నిలిచిన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావాలని ప్రతి తెలుగోడు ఉత్కంతంగా ఎదురుచూస్తున్నారు. అస్కార్ వేదికపైకి చేరుకున్న బాలీవుడ్ నటి దీపిక పదుకోణె. స్టేజ్ పై ఆర్‌ఆర్‌ఆర్ గురించి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ గురించి దీపిక ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్' మూవీ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది.

భారత్ కు అవార్డుల పండగ
ఈ అవార్డ్ కోసం అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా), క్లోజ్ (బెల్జియం), ది క్వైట్ గర్ల్ (ఐర్లాండ్) నామినేట్ అయ్యాయి. ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్స్‌గా నిలిచాయి. ఈ అవార్డ్ కోసం ది ఫ్లయింగ్ సెయిలర్, ఐస్ మర్చంట్స్, మై ఇయర్ ఆఫ్ డిక్స్, యాన్ ఓస్ట్రిచ్ టోల్డ్ మి ది వరల్డ్ ఈజ్ ఫేక్, ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అయ్యాయి. ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డు కోసం వేదిక మీదకు ఫిల్మ్ మేకర్ గునీత్ మోంగా చీరకట్టులో వెళ్లారు. కార్తికి గాన్‌స్లేవ్స్, గునీత్ మోంగా సైతం సంప్రదాయ దుస్తుల్లో అవార్డ్ అందుకున్నారు.












Click it and Unblock the Notifications