బెంగళూరులో ఉద్యోగం నుంచి తొలగించారని కంపెనీకి నిప్పంటించిన ఉద్యోగులు !

బెంగళూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్లు ఐటీ హబ్ లో పెద్ద కార్యాలయం (company) ప్రారంభించారు. అదే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉద్యోగం చేస్తూ ఇంతకాలం హ్యాపీగా జీతం తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. అయితే ఉద్యోగం చేస్తున్న ఇద్దరు యువకులు అదే కంపెనీ మీద పెట్రోల్ పోసి నిప్పంటించడంతో కంపెనీ యాజమాని రూపా హడలిపోయింది.

ప్రయివేటు సంస్థ తమను ఉద్యోగం నుంచి తొలగించిందంటూ ఆగ్రహించిన ఉద్యోగులు ఇంతకాలం పని చేసిన కంపెనీపై (company) పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన బెంగళూరు (Bengaluru) నగరంలో కలకలం రేపింది. రాహుల్ పూజారి అలియాస్ రాహుల్, లాసర్ పీటర్ జాన్ అలియాస్ జాన్ అనే నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు. బెంగళూరు నగరంలోని పృథ్వీ పార్క్ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ (real estate) కంపెనీలో నిందితులు ఇంతకాలం ఉద్యోగాలు చేశారని పోలీసులు తెలిపారు.

The employees of the real estate company where they worked, poured petrol and set it on fire in Bengaluru city

ఏరియా సేల్స్ మేనేజర్‌గా రాహుల్ ఉద్యోగంలో చేరాడు. రీజనల్ సేల్స్ మేనేజర్‌గా సన్ పీటర్ జాన్ ఉద్యోగంలో చేరాడు. ఉమాశంకర్, రూపా అనే ఇద్దరు యాజమాన్యంలో ఈ కంపెనీ కార్యకలాపాలు (company) జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. నిందితలు కంపెనీ మీద (real estate) పెట్రోల్ పోసి నిప్పంటించడంతో కంపెనీలోని రూ 11 లక్షల విలువైన ఫర్నిచర్‌, విలువైన వస్తులు ధ్వంసం అయ్యాయని కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టార్గెట్ రీచ్ కాలేదని కంపెనీ యాజమాన్యం రాహుల్, పీటర్ జాన్ అనే ఇద్దరు ఉద్యోగులను ఇటీవల తొలగించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాహుల్, జాన్ ఇటీవల కంపెనీ (company) యజమాని రూపాకు ఫోన్ చేసి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారని పోలీసులు అన్నారు. అయితే రూపా, ఉమాశంకర్‌లు ఇంతకాలం ఆ కంపెనీలో పని చేసిన రాహుల్, జాన్ లకు జీతం (salary) ఇచ్చేందుకు నిరాకరించారని సమాచారం.

The employees

ఇంతకాలం పనిచేసినా జీతం ఇవ్వలేదని కంపెనీ యాజమాన్యం మీద రాహుల్, జాన్ కక్ష పెంచుకన్నారు. ఇటీవల ఉదయం ఆఫీసుకు వచ్చిన ఇద్దరు యువకులు హౌస్ కీపర్ గా పనిచేస్తున్న మున్ని అనే మహిళను కంపెనీలో నుంచి బ యటకు రావాలని చెప్పి తరువాత వెంట తీసుకెళ్లిన పెట్రోల్ ( petrol) కంపెనీ (company) లోపల పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటనపై కంపెనీ యాజమాన్యం పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కంపెనీలో పెట్రోల్ ( petrol) పోసి నిప్పంటించిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+