20 రోజుల క్రితం పుట్టిన కూతురికి విషం ఇంజక్షన్ వేసిన తండ్రి !

భువనేశ్వర్: వివాహం చేసుకున్న తరువాత చాలా సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదని చాలా మంది దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగుతుంటారు. దేవాలయాలు తిరిగి ప్రత్యేక పూజలు చేసి మాకు పిల్లలు పుట్టేలా దీవించు స్వామి అని వేడుకుంటారు. కొందరు నాటు మందులు వాడుతూ పిల్లలు పుట్టాలని ఆశపడుతుంటారు. అయితే కూతురు పుట్టిన 20 రోజులకే చిన్నారిని కన్న తండ్రి హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

ఒడిశాలో 20 రోజుల క్రితం పుట్టిన ఆడబిడ్డకు తండ్రి విషం ఎక్కించి పాపను చంపేయాలని ప్రయత్నించాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో తన నవజాత శిశువుకు విషం ఇంజెక్ట్ చేసి చంపడానికి ప్రయత్నించిన కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అమానవీయ చర్య సోమవారం జరిగిందని, నిందితుడు చందన్ మహాన్ ను అరెస్టు చేశామని మంగళవారం పోలీసులు తెలిపారు.

 father injected

పాప పుట్టిన తరువాత చందన్ మహాన్ భార్య తన్మయి నీలగిటి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింఘరి గ్రామంలో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.. కూతురిని చూడాలనే సాకుతో మా ఇంటికి వచ్చిన చందన్ మహాన్ నా కూతురు స్నానం చేస్తుండగా చిన్నారికి విషం ఎక్కించాడని తన్మయి తండ్రి భగీరథ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పెళ్లయిన రెండు సంవత్సరాల తరువాత చందన్ మహానక, తన్మయి దంపతులకు 20 రోజుల క్రితమే ఆడపిల్ల పుట్టింది. చందన్ మహాన్ కు ఆడపిల్ల పుట్టిందని చాలా బాధపడ్డాడు. నాకు కూతురు పుట్టడం ఇష్టం లేదని చందన్ మాకు నేరుగా చెప్పాడని తన్మయి తండ్రి భగీరథ్ సింగ్ అన్నారు. చందన్ కూతురితో కలిసి కూర్చున్నాడు. ఈ సమయంలో తల్లి స్నానం చేసేందుకు వెళ్లింది.

ఈ సమయంలో పాప వెంటనే బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. వెంటనే నేనూ, నా కూతురు తన్మయి బిడ్డ ఉన్న చోటికి వచ్చాం. ఈ సమయంలో పాప వీపు కింద విషం సీసా, సిరంజి ఉండటాన్ని ఆమె తల్లి తన్మయి గమనించిందని భగీరథ్ సింగ్ తెలిపారు. చిన్నారికి విషం ఇంజెక్ట్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మేము ఈసారి అతన్ని గట్టిగా ప్రశ్నించామని భగీరథ్ అన్నారు.

 father injected

అయితే ఈసారి నేను ఇంజెక్షన్ చేయలేదని చందన్ మహాన్ చెప్పాడని కుటుంబ సభ్యులు అన్నారు. భగీరత్ గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో చందన్ కు దేహశుద్ది చేసి పోలీసుకు అప్పగించారు. పోలీసుల విచారణలో తన కూతురికి విషం ఇంజక్షన్ ఇచ్చానని చందన్ అంగీకరించాడు. పోలీసులు, గ్రామస్థులు చిన్నారిని బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+