మాజీ మంత్రి బావ కిడ్నాప్, మనిషి మాత్రం మాయం, కారు మొత్తం రక్తం, సీసీటీవీ కెమెరాల్లో ?
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్ బావ మహదేవయ్య మిస్సింగ్ కేసు మలుపు తిరుగింది. కనపడకుండా పోయిన పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి బావ హత్యకు గురైనాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చామరాజనగర జిల్లా, మైసూరు జిల్లా సమీపంలోని హనూర్ తాలూకాలోని రామపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో కనిపించకుండా పోయిన వ్యక్తి కారు కనిపించింది.
కారు ఉన్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న ఓ దుకాణంలో సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా ఆ కారులో నుంచి ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకుని కిందకు దిగినట్లు రికార్డైందని పోలీసు అధికారులు అంటున్నారు. కారు అద్దాలు పగిలిపోవడం, కారులోని రక్తపు మరకలను పరిశీలిస్తే కనిపించకుండా పోయిన మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ బావ మహదేవయ్య హత్యకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మాజీ మంత్రి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయమై కర్ణాటక పోలీసులు అధికారులు ఎలాంటి వివరాలు బయటకు చెప్పకపోవడంతో కనీసం స్పందించడానికి కూడా భయపడుతున్నారు. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ లీరడ్ సీపీ యోగేశ్వర్ బావ మహదేవయ్య కోసం కొళ్లేగాల డీవైఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్ లు, రామనగర జిల్లా పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్ కూడా సోమవారం సాయంత్రం రామాపురకు చేరుకున్నారు. హనూర్ తాలూకాలోని రామాపురానికి చెందిన బావ మహదేవయ్య కారు గల్లంతైన విషయం విని ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్ పరుగు తీశారు. ఆదివారం అర్థరాత్రి రామాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో మహదేవయ్య ప్రయాణిస్తున్న కారు కనిపించడంతో సీపీ యోగేశ్వర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి సమాచారం సేకరించారు.

చెన్నపట్నం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రల నిపుణులు కూడా కారును తనిఖీ చేస్తున్నారు. ఇంతలో కారు అద్దాలు పగలడంతో పాటు రక్తపు మరకలు కూడా కనిపించాయి. మూడు రోజుల క్రితం సొంత ఫామ్ హౌస్ లో ఉన్న మహదేవయ్య కనిపించకుండా పోయారు. మాజీ మంత్రి బావ మహదేవయ్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని వెలుగు చూసింది. అయితే మహదేవయ్యను ఎవరు కిడ్నాప్ చేశారు. ఆయన ఏమైనారు అనే విషయం అంతుచిక్కకపోవడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications