బాయ్ ఫ్రెండ్ ను లూటీ చేసి నగ్నంగా రోడ్డు మీద వదిలేసి కొత్త ప్రియుడితో జంప్!
ముంబాయి/థానే: తనను కలవాలని బాయ్ ఫ్రెండ్ ను పిలిచిన యువతి ఆమె స్నేహితుడితో కలిసి ప్రియుడి దగ్గర డబ్బు, బంగారు నగలతో సహా విలువైన వస్తువులన్నీ దోచుకుంది. చివరికి ప్రియుడి మీద దాడి చేసి అతన్ని నగ్నంగా చేసి హైవే రోడ్డు మీద మార్గం మధ్యంలో వదిలేసిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా షహాపూర్‌లో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని షాహాపూర్‌కు చెందిన బాలాజీ శివభగత్ బిల్డర్ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడు. షాహాపూర్‌లో నివాసముంటున్న భావిక బోయిర్ అలియాస్ భావికతో కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. భావిక చూడటానికి సినిమా హీరోయిన్ లాగా ఎర్రగా అందంగా ఉండటంతో బిల్డర్ బాలాజీ ఆమె వలలో పడిపోయాడు. బాలాజీ, భావిక కొన్ని ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

జూన్ 28వ తేదీన భావికా భోయిర్ హఠాత్తుగా తన బిల్డర్ ప్రియుడు బాలాజీకి ఫోన్ చేసి తనను కలవాలని కోరింది. ఇదే సమయంలో తనకు బంగారు నగలు తీసుకురావాలని చెప్పింది. ప్రియురాలు భావిక కోరిక మేరకు బాలాజీ ఆమె అడిగిన బంగారు నగలు అన్నీ తీసుకుని సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రియురాలు భావిక చెప్పిన అట్గావ్ హైవే వద్దకు వెళ్లాడు.
బాలాజీ అతని కెట్రా కారులో ప్రియురాలు భావికతో కుర్చుని మాట్లాడుతున్నాడు. ప్రియుడు బాలాజీ తెచ్చిన బంగారు నగలు అన్ని చూసిందది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు కారు దగ్గరకు వెళ్లి కారులో ఉన్న బాలాజీపై దాడికి దిగారు. తరువాత అదే కారులో బాలాజీని కిడ్నాప్ చేశారు. సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు బాలాజీని ఓ రిసార్టులో పెట్టి చితకబాదేశారు. బాలాజీ మీద దాడి చేసిన దుండగులు అతని వద్ద ఉన్న విలువైన బంగారు నగలు, నగదు, మొబైల్ ఫోన్ మొత్తం లాక్కొన్నారు, చివరికి బాలాజీని నగ్నంగా చేసి అతని శరీరం మీద అండర్ వేర్ మాత్రం పెట్టి అతన్ని షాహాపురా హైవేపై రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
స్థానికుల సహాయంలో బాలాజీ ఆసుపత్రిలో చేరి ఇన్ని రోజులు చికిత్స పొందాడు. చివరికి ప్రియురాలి భావిక తనను మోసం చేసిందని తెలుసుకుని షాక్‌కు గురైన బాలాజీ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రియురాలు భావికకు ప్రతిదీ చేసానని, ఆమె కోరిక మేరకు ఆమె కోసం ఇల్లు కట్టి ఇచ్చానని, ఆమె కోరుకున్నప్పుడల్లా నేను ఆమెకు బంగారు నగనలు ఇచ్చానని, చివరికి ఆమె వేరే యువకుడితో తిరుగుతూ తనను మోసం చేసిందని బాలాజీ పోలీసులకు చెప్పాడు. .
తన మీద దాడి జరిగిన రోజు తన ప్రియురాలు భావికకు బంగారు కమ్మలు, రెండు బంగారు గాజులు, బ్రాస్ లైట్ తీసి ఇచ్చానని, చివరికి తన మెడలో ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలు లాక్కొని తన మీద దాడి చేసి తన కారుతో సహ పరారైనారని బాలాజీ పోలీసులకు చెప్పాడు. భావిక ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తోందని, ఆమె ఇంటి దగ్గర కూడా లేదని, ఆమెతో పాటు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రియురాలి కోసం వెళ్లిన బిల్డర్ బాలాజీ నిలువు దోపిడీకి గురి కావడమే కాకుండా నగ్నంగా రోడ్డు మీద పడటం ఇప్పుడు థానేలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications