ప్రియురాలితో ఎస్కేప్, బాయ్ ఫ్రెండ్ తల్లిని నగ్నంగా చేసి ఊరు మొత్తం ఊరేగింపు, వీడియోలు తీసి!

మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది. బెళగావిలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. బెళగావి తాలూకా వంటమూరి గ్రామంలోని బసవేశ్వర్ వీధిలో ఈ దారుణం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఓ యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకుని ప్రియురాలితో పారిపోవడంతో ఆ యువకుడి తల్లిని శిక్షించారు.

యువకుడి తల్లి పేరు అనసూయ (42) (పేరు మార్చాడం జరిగింది) పట్ల నిందితులు దారుణంగా ప్రవర్తించారని వెలుగు చూసింది. అనుసూయ కుమారుడు దుర్గా అతని ప్రియురాలితో కలిసి పారిపోయాడు. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మహిళను నగ్నంగా చేసి చెట్టుకు కట్టేసి ఆమెను చితకబాది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. మహిళను నగ్నంగా గ్రామం మొత్తం ఊరేగించారు.

The girlfriends family members attacked her boyfriends mother and paraded her naked in the village

అనుసూయ కుమారుడు దుర్గా అదే గ్రామానికి చెందిన ప్రియాంక అనే యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రియాంకకు వేరే అబ్బాయితో కుటుంబ సభ్యులు సోమవారం నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. అయితే ఆదివారం రాత్రి దుర్గా అతని ప్రియురాలు ప్రియాంకతో కలిసి పారిపోయాడు. రాత్రి ప్రియాంక అతని ప్రియుడు దర్గకు ఫోన్ చేసి ఊరి బయటకు రావాలని చెప్పిందని, తరువాత ఇద్దరు బెళగావి మీదుగా మహారాష్ట్ర పారిపోయారని తెలిసింది.

సోమవారం వేకువ జామున ప్రియాంక ఇంట్లో లేదని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఆగ్రహించిన ప్రియాంక కుటుంబ సభ్యులు దుర్గా ఇంటికి వెళ్లి అతని తల్లి అనసూయను ఇంటి నుంచి బయటకు లాగి ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. అనసూయ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం అనసూయను గ్రామంలో నగ్నంగా ఊరేగించారని బాధితురాలు ఆరోపించారు.

ఈ కేసులో ప్రియాంక కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఏడుగుర అనుసూయ పట్ల దారుణంగా వ్యవహరించారని బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకతీయ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో ముందుజాగ్రత్త చర్యగా రెండు కేఎస్‌ఆర్‌పీ బృందాలను మోహరించారు. ప్రియాంక, ఆమె ప్రియుడు దుర్గ ఎక్కడ ఉన్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+