Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం అని కొవ్వు, పెళ్లికూతురికి చుక్కలు, సంకనాకిపోయిన శోభనం !

పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తాళి కట్టే సమయంలో పెళ్లికొడుక్కి పెళ్లికూతురితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సినిమా చూపించారు. ఏం చేయాలో తెలిక పెళ్లికొడుకు సతమతం అవుతున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి చేసుకుని హ్యాపీగా అదే రోజు రాత్రి శోభనం గదిలోకి అడుగుపెట్టాల్సిన పెళ్లి కొడుకు ఇప్పుడు అత్తారింటిలో అడుగుపెట్టి ఊచలు లెక్కపెడుతున్నాడు.

కర్ణాటకలోని ధారవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాత హుబ్బళికి చెందిన సచిన్ విఠల్ సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి రోజు సచిన్ విఠ్ఠల్ పాటిల్ కట్నం డిమాండ్ చేసి ఇప్పుడు జైలుకు వెళ్ళాడు. వరుడు సచిన్ విఠల్ పాటిల్ మీద వధువు ఫిర్యాదు మేరకు వరుడు, అతని కుటుంబసభ్యులపై ఖానాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

The groom was arrested for refusing to marry if he did not pay the dowry in Kalyanamandapam

పోలీసులు వరుడు సచిన్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారని, న్యాయమూర్తి సూచనల మేరకు నిందితుడైన వరుడిని బెళగావి జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఖానాపూర్ తాలూకాలోని ఒక గ్రామానికి చెందిన యువతి ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న పాత హుబ్బళికి చెందిన సచిన్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. గత మేలో సచిన్ కు, ఆ యువతికి నిశ్చితార్థం జరిగింది.

ధారవాడలోని లోకమాన్య సభాగృహలో సచిన్ కు, ఆ యువతికి వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి సచిన్ బంధువులు, స్నేహితులు, పెళ్లికూతురి కుటుంబ సభ్యులు, బంధులు అందరూ హాజరైనారు. వివాహం ముందు జరిపే పద్దతులలో అన్ని శాస్త్రాలు జరుగుతున్నాయి. పెళ్లికూతురి మెడలో తాళికట్టే గంట ముందు వరుడు సచిన్ తనకు రూ 10 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

The groom was arrested for refusing to marry if he did not pay the dowry in Kalyanamandapam

తాను కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నానని, తనకు కట్నం ఇవ్వపోతే పెళ్లి చేసుకోను అని వరుడు సచిన్ రివర్స్ అయ్యాడు. అయితే వధువు తరపు వారు కట్నం ఇచ్చేందుకు నిరాకరించారు. వరుడు సచిన్ కట్నం ఇస్తే తప్పా ఈ పెళ్లి జరగదని సినిమా స్టైల్లో తేల్చిచెప్పాడు. వరుడు సచిన్ కట్నం దాహానికి విసిగివేసారిన వధువు, ఆమె తల్లిదండ్రులు ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

The groom was arrested for refusing to marry if he did not pay the dowry in Kalyanamandapam

ఖానాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఆదేశాల మేరకు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పెళ్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి ముందు రోజు కూడా డబ్బు, బంగారం డిమాండ్ చేశాడని, తరువాత పెళ్లి చేసుకుంటానని అంగీకరించి ఇప్పుడు కల్యాణమండపంలో డబ్బు, బంగారం ఇవ్వకుంటే పెళ్లి చేసుకోనని పెళ్లి కొడుకు సచిన్ బెదిరించినట్లు పెళ్లికూతురు పోలీసులకు సమాచారం అందించింది. ఈ సందర్భంగా పెళ్లికూతురు స్వయంగా ఫిర్యాదు చెయ్యడంతో పెళ్లికొడుకు సచిన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+