భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని పగ, భర్త ఏం కోరికేశాడు అంటే !
తాగుబోతు భర్త తన భార్య చెంపలు, కళ్లు కొరికి పైశాచిక చర్యకు పాల్పడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా శిశిల గ్రామంలో చోటుచేసుకుంది. భార్యపై దారుణంగా దాడి చేసిన కిరాతక భర్త సురేష్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కసాయి భర్త హింసకు తాళలేక పారిపోవడానికి సాధ్యం కాకపోవడంతో అతని భార్య అపస్మారక స్థితిలో కుప్పకూలింది.
బాధితురాలు ఉజిరాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిని రక్షించేందుకు వచ్చిన కూతురుపై కూడా నిందితుడు సురేష్ దాడి చేశాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంటి నుంచి పారిపోయిన కూతురు ఆ విషయం ఇరుగుపొరుగు వారికి చెప్పింది. ఇరుగుపొరుగు వారు వెళ్లే సరికి సురేష్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.అనంతరం స్థానికులు సురేష్ భార్యను ఆస్పత్రిలో చేర్పించారు.

భర్త సురేష్ దాడి చెయ్యడంతో అతని భార్య ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని పోలీసులు అన్నారు. బెల్తంగడిలోని ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సురేష్ కు అతని భార్య మీద అనుమానం ఉందని పోలీసులు చెప్పారు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తోందని సురేష్ గౌడ రగిలిపోయాడు. ఇదే విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

పద్దతి మార్చుకోవాలని సురేష్ గౌడ అతని భార్యకు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాడని తెలిసింది. ఎంత చెప్పినా తన భార్య పద్దతి మార్చుకోవడం లేదని సురేష్ గౌడ అతని స్నేహితులతో చెప్పేవాడని పోలీసులు అన్నారు. పద్దతి మార్చుకోకుండా ప్రియుడితో జల్సా చేస్తున్నావా అంటూ భార్యను చితకబాదిన సురేష్ గౌడ ఆమె చెంపలు కొరికేసి ఆమె ముఖం చిధ్రం చెయ్యడానికి ప్రయత్నించాడని, ఇదే సమయంలో కన్ను కూడా కొరికేశాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications