బంగ్లాలో సుప్రీం కోర్టు లేడీ లాయర్ ను హత్య చేసిన భర్త, శవంతో 36 గంటలు !
న్యూఢిల్లీ/నోయిడా: చిన్నతనంలో తాను నివసిస్తున్న బంగ్లాను అమ్మేందుకు అభ్యంతరం చెప్పిన భార్యను ఆమె భర్త హతమార్చిన షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి లాయర్ భర్త 61 ఏళ్ల నితిన్ నాథ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడాలోని అతను నివసించే బంగ్లాలో ఈ చర్య జరిగింది.
అయితే హత్యకు గురైన మహిళ సామాన్య మహిళ కాదు. ఆమె సుప్రీం కోర్టులో ఎంతో పేరు పొందిన లాయర్ అని పోలీసులు అన్నారు. భార్యను హత్య చేసిన తరువాత నిందితుడు 36 గంటల పాటు అదే బంగ్లాలోని స్టోర్ రూమ్‌లో దాక్కున్నాడు. లేడీ లాయర్, ఆమె భర్త ఫోన్ లను పోలీసులు ట్రాక్ చేయడంతో అతను ఇంట్లోని స్టోర్ రూమ్‌లో దాక్కున్నట్లు వెలుగు చూసింది.

పోలీసులు నితిన్ సాథ్ ను అరెస్టు చేశారు. నోయిడాలోని సెక్టార్ 30లోని బంగ్లాలోని బాత్‌రూమ్‌లో సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది రేణు సిన్హా అలియాస్ రేణు మృతదేహం లభ్యమైందని పోలీసులు అన్నారు. నితిన్ సాథ్, రేణు సిన్హా దంపతుల కుమారుడు విదేశాల్లో ఉండడంతో ఈ పెద్ద బంగ్లాలో దంపతులు మాత్రమే నివాసం ఉంటున్నారు.
గత రెండు రోజులుగా బంధువులు ఫోన్ చేసినా సుప్రీం కోర్టు లాయర్ రేణు స్పందించకపోవడంతో రేణు సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. అలాగే పోలీసులతో బంగ్లా వద్దకు చేరుకోగా లోపల రేణు మృతదేహం కనిపించింది. సుప్రీం కోర్టు లాయర్ రేణు భర్త నితిన్ నాథ్ సిన్హా కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
దీని తరువాత పోలీసులు రేణు సిన్హా ఫోన్‌ను ట్రాక్ చేసినప్పుడు అదే బంగ్లాలో ఆమె చివరి ఫోన్ కాల్ లో మాట్లాడినట్లు చూపించింది. తరువాత రేణు బంగ్లాను శోధించినప్పుడు ఆమె భర్త నితిన్ అదే బంగ్లాలోని స్టోర్ రూమ్‌లో దాక్కున్నాడని వెలుగు చూడటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు సుప్రీం కోర్టు మహిళా న్యాయవాది రేణు సిన్హా సోదరుడు తన సోదరిని ఆమె భర్త నితిన్ హత్య చేశాడని ఫిర్యాదు చేశాడు.
అరెస్టు అయిన నిందితుడు నితిన్ ను పోలీసులు విచారించగా బంగ్లాను విక్రయించే విషయంలో తన భార్య రేణు వారి మధ్య గొడవలు జరిగాయని, ఆమె బంగ్లాను అమ్మేందుకు ఇష్టపడలేదని, అందుకే నా భార్యను హత్య చేసినట్లు నితిన్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. బంగ్లాను అమ్మడానికి తన భార్య రేణు అస్సలు ఇష్టపడలేదు, కానీ భర్త బంగ్లాను అమ్మడానికి ప్రయత్నించాడని, వేరే వారి దగ్గర నుంచి అడ్వాన్స్ గా కొంత డబ్బు తీసుకున్నాడని పోలీసులు అన్నారు.
ఈ విషయంపై భార్య రేణు అభ్యంతరం వ్యక్తం చేయడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, చివరికి భార్య రేణు హత్యకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. చిన్ననాటి నుంచి నివసిస్తున్న బంగ్లాను విక్రయించడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు మహిళా న్యాయవాది ఆమె భర్త చేతిలోనే హత్యకు గురికావడం నోయిడాలో కలకలం రేపింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications