అక్రమ సంబంధం, భార్య ప్రైవేట్ పార్ట్ లో క్రికెట్ వికెట్ తో ?, సైకో భర్త !
బెంగళూరు/చిత్రదుర్గ: కుటుంబంలో భార్యాభర్తల మధ్య లెక్కపెట్టలేని సంఖ్యలో మనస్పర్థలు రావడం సర్వసాధారణం. అయితే అన్నింటినీ మరిచిపోయి ప్రేమ, సహజీవనంతో జీవితాన్ని గడపడమే నిజమైన దంపతుల లక్షణం. అయితే ఓ ఇంట్లో భార్యపై ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త ఆమె మీద అనుమానం పెంచుకుని దిక్కుమాలిన శాడిస్టు వైఖరి చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని చెళ్లకెరె పట్టణంలోని పావగడ రోడ్డులో భాస్కర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా భాస్కర్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రూపా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను భాస్కర్ పెళ్లి చేసుకున్నాడు.

వివాహం జరిగిన తరువాత కొన్ని సంత్సరాలు భాస్కర్ అతని భార్య రూపాతో సంతోషంగానే ఉన్నాడని తెలిసింది. ప్రతిరోజు భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగం చెయ్యడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెలుతున్నాడు. భాస్కర్ ప్రతిరోజు జనరల్ షిఫ్ట్ చేస్తూ రాత్రి ఇంటికి వస్తున్నాడు. భాస్కర్ ఉద్యోగానికి వెళ్లిపోవడంతో అతని భార్య రూపా ఇంట్లో ఉంటున్నది.
తన భార్య రూపాకు అక్రమ సంబంధం ఉందని, అందుకే తనతో శారీరక సంబంధానికి దూరంగా ఉంటోందని భాస్కర్ కు అనుమానం వచ్చింది. తాను ఉద్యోగానికి వెళ్లిన తరువాత తన భార్య రూపా ఆమె ప్రియుడితో రొమాన్స్ చెయ్యడానికి వెలుతోందని భాస్కర్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో భాస్కర్, రూపా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తన భార్యకు తగిన బుద్ది చెప్పాలని భాస్కర్ డిసైడ్ అయ్యాడు. భార్య రూపా మీద పగ తీర్చుకోవడానికి సమయం కోసం భాస్కర్ వేచి చూశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వంటగదిలో పని చేస్తున్న భార్య రూపాను హాల్ లోకి ఈడ్చుకుని వచ్చిన భాస్కర్ ఆమె మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. భార్య అరుపులు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడు.
తరువాత శాడిస్టు భర్త భాస్కర్ అతని భార్యను వివస్త్రను చేశాడు. ముందుగా తీసుకెళ్లిన క్రికెట్ వికెట్ తీసుకుని భార్య మర్మంగం మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. నొప్పి తట్టుకోలేక కేకలు వేసిన భార్య మతిపోయి కుప్పకూలిపోయింది. తరువాత ఏమి తెలియని అమాయకుడిలాగా భాస్కర్ అతని భార్య చెళ్లకెరె ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడానికి ప్రయత్నించాడు.
అయితే డాక్టర్లకు అనుమానం వచ్చి పరిశీలించగా బాధితురాలి ప్రైవేట్ భాగాల్లో తీవ్రగాయాలైన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైకో భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ ఇంటిలో పరిశీలించగా మొత్తం రక్తపుమరకలు ఉన్నాయని, దాడికి ఉపయోగించిన క్రికెట్ వికెట్ కూడా చిక్కిందని పోలీసులు చెప్పారు.

బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో దావణగెరె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పారు. తన భార్యకు అక్రమ సంబందం ఉందనే అనుమానంతో ఆమెను ఇలా చేశానని భాస్కర్ అంగీకరించడానికి చెళ్లకెరె పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య ప్రైవేట్ పార్ట్స్ లో క్రికెట్ వికెట్ తో దాడి చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications