భార్య మీద ఫుల్ డౌట్, నలుగురు సరిపోరా ?, భార్యను తుపాకితో కాల్చేసిన భర్త ఏం చేశాడంటే ?
బెంగళూరు/కలబురిగి: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. వ్యాపారం చేస్తున్న భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. భార్యను తుపాకితో కాల్చి చంపేసిన భర్త ఇంటికి వెళ్లి శుభ్రంగా ఉరి వేసుకున్నాడు.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని చిత్తాపుర సమీపంలోని బి. అల్లూర గ్రామానికి చెందిన బసవరాజు హంపయ్య నారాయణి అలియాస్ బసవరాజ్ (40) కొన్ని సంవత్సరాల క్రితం హనమమ్మ అలియాస్ హను (35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. భార్య హనుతో బసవరాజ్ సంతోషంగా కాపురం చేశాడు.

వివాహం జరిగిన చాలా సంవత్సరాలకు బసవరాజ్, హను దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. భార్యాభర్తలు బసవరాజ్, హనుల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలం నుంచి గొడవలు జరగుతున్నాయి. గత నెల రోజుల క్రితం బసవరాజ్ భార్య హను ఆమె భర్తను వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే నివాసం ఉంటోంది.
కే. అల్లూర గ్రామంలో ఊరిపండుగ జరిగింది. ఆ సందర్బంలో 101 ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి గ్రామం మొత్తం ఊరేగించి చాలా గ్రాండ్ గా పండుగ చేస్తున్నారు. ఆ సందర్భంగా గ్రామస్తులు సంబరాలు చేసుకుంటుండగా బసవరాజ్ మద్యం తాగి భార్య హను గ్రామంలోకి వెళ్లాడు. తరువాత భార్య హను ఇంటికి వెళ్లిన బసవరాజ్ ఆమెతో గొడవ పడ్డాడు.
చాలాకాలం నుంచి తన భార్య హను అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని, తనను, పిల్లలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తనను మోసం చేస్తోందని బసవరాజ్ కు అనుమానం ఉంది. ఇదే విషయంలో బసవరాజ్, హను దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి, పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండాపోయింది.

భార్య హను ఇంటి దగ్గరకు వెళ్లి ఇదే విషయంలో గొడవపడిన బసవరాజ్ ఆమెను చితకబాదేశాడు. భార్య కుటుంబ సభ్యులు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా బసవరాజ్ మాత్రం వారి మాటవినలేదు. ఆ సందర్బంలో వెంట తీసుకెళ్లిన తుపాకితో భార్య హనును కాల్చి చంపిన బసరాజ్ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
ఈ ఘటన తర్వాత చిత్తాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అతడి కోసం గాలించారు. తరువాత బి. అల్లూర గ్రామంలోని బసవరాజ్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి వెళ్లి పరిశీలించగా బసవరాజ్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించాడు. బసవరాజ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. భార్య మీద అనుమానంతోనే ఆను కాల్చి చంపేసిన బసవరాజ్ తరువాత పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు తెలిపారు.












Click it and Unblock the Notifications