లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్తను ఎలా టార్చర్ పెట్టిందంటే ?, అత్త ఎంట్రీ ఇస్తే భర్తకు ?

బెంగళూరు/హాసన్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తరువాత ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొంతకాలం పెళ్లి చేసుకున్న భర్తతో ఆమె కాపురం చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, అమ్మమ్మ కలిసి నవవరుడిని బ్లాక్ మెయిల్ చేశారు. చివరికి అనుకున్నట్లే నవవరుడిని జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన యువకుడిని అతని భార్య టార్చర్ పెట్టింది.

భార్య టార్చర్ తట్టుకోలేక నవవరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని ఉదయ్ పూర్ లో కిరణ్ అనే యువకుడ నివాసం ఉంటున్నాడు. ఉదయ్‌పూర్‌లో కిరణ్ సొంతంగా బేకరీ నడుపుతున్నాడు. బేకరికి వచ్చి వెలుతున్న స్పందన (24) అనే యువతి కిరణ్ కు పరిచయం అయ్యింది. రానురాను స్పందన, కిరణ్ ప్రేమించుకున్నారు. అప్పటికే వ్యాపారం చేస్తూ డబ్బు సంపాధిస్తున్న కిరణ్ అతని ప్రియురాలు స్పందనకు విపరీతంగా డబ్బులు ఖర్చు చేశాడు.

marriage1
కుటుంబ సభ్యులను ఎదిరించి గత ఫిబ్రవరి 19న వాగరహళ్లి గ్రామానికి చెందిన స్పందనను కిరణ్ పెళ్లి చేసుకున్నాడు. ఉదయ్ పూర్ లో స్పందన, కిరణ్ ప్రత్యేకంగా కాపురం పెట్టారు. వివాహం జరిగిన తరువాత భర్త కిరణ్ తో కొంతకాలం కాపురం చేసిన స్పందన తరువాత ఆమె తల్లిదండ్రుల మాట విని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు కిరణ్ ను వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయింది.

భార్య స్పందను కాపురానికి పిలుచుకుని రావాలని కిరణ్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే తల్లిదండ్రుల మాట విన్న స్పందన మాత్రం తాను కాపురానిని రాను అంటూ ఆమె భర్త కిరణ్ కు చెప్పింది. అనంతరం కిరణ్‌ను అతని భార్య స్పందన, ఆమె తండ్రి వాసు, తల్లి గీత, అమ్మమ్మ రత్నమ్మ కలిసి డబ్బులు ఇస్తే అమ్మాయిని కాపురానికి పంపిస్తామని, లేదంటే కాపురానికి పంపించమని డిమాండ్ చేశారు.

అలాగే స్పందన, ఆమె తల్లిదండ్రులు వాసు, గీతా ముగ్గురు కలిసి కిరణ్‌ను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కిరణ్ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయని, ఆ డబ్బు లాక్కోవాలని స్పందనతో పాటు ఆమె కుటుంబ సభ్యులు చాలాకాలం అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.

policestation

కిరణ్ డబ్బులు ఇవ్వకపోవడంతో స్పందన అతనిపై జూన్ 2వ తేదీన చెన్నరాయపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసింది. పోలీసులు కిరణ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అనంతరం కిరణ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కిరణ్ ను మళ్లీ అతని భార్య స్పందన, ఆమె కుటుంబ సభ్యులు వేదింపులకు గురి చేశారు.

భార్య స్పందన కుటుంబ సభ్యుల టార్చర్ తట్టుకోలేకపోయిన కిరణ్ కొన్ని రోజులుగా బేకరి కూడా మూసేసి దిగులుగా ఉంటున్నాడు. జీవితంపై విరక్తి చెందిన కిరణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్పందన, ఆమె కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టడం వలనే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. హలేనరసీపూర పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించి కేసు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+