బ్యూటీపార్లల్ కు వెళ్లిన భార్య, విదేశాల నుంచి వీడియో కాల్ చేసిన భర్త ఏం చేశాడంటే ? !

బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విచిత్రమైన విషయంలో భార్యకు ఆమె భర్త తలాక్ చెప్పాడు. తలాక్ ఎందుకు చెప్పాడు అని తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. మైండ్ బ్లాక్ అయ్యే తలాక్ కేసు వెలుగు చూసింది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లి కనుబొమ్మలు కట్ చేయించుకున్నందుకు ఓ భర్త అతని భార్యకు వీడియో కాల్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు.

ఆ తర్వాత ఆ మహిళ తన భర్తకు చాలాసార్లు ఫోన్ చేసినా అతను మాత్రం ఫోన్ కాల్ రిసీవ్ చెయ్యలేదు. నా భర్తకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ అతను నా ఫోన్ కాల్ రిసీవ్ చెయ్యలేదని, ఆతర్వాత మా అత్తగారికి, మామగారికి ఫోన్ చేసినా ఈ విషయం మాకు తెలీదని చెప్పారని బాధితురాలు అంటోంది. తన అత్తమామలు కూడా తన భర్తకు మద్దతుగా నిలిచారని బాధితురాలు అంటోంది.

The husband divorced his wife after going to a beauty parlor and getting her eyebrows cut.

తన భర్త తనకు అన్యాయం చేశాడని తాను పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు యువతి తెలిపింది. న్యాయం చేయాలంటూ యువతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె భర్త, అత్తమామలతో పాటు మొత్తం ఐదుగురిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కాన్పూర్‌లోని కులీ బజార్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ నివసించే లాలీ గుల్సాబా అనే మహిళ 2022 జనవరి 17వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో నివసిస్తున్న సలీమ్‌ ను వివాహం చేసుకుంది.

వివాహం తరువాత లాలీ గుల్సాబా కుటుంబం ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్‌పూర్‌లో నివసిస్తుంది.

అయితే సలీం సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడే పనిచేస్తున్నాడు. వరకట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని లాలీ గుల్సాబా ఆరోపించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2023 ఆగస్టు 30వ తేదీన సలీం పని నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అయితే పెళ్లయిన రోజు నుంచి అత్తగారు వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితమే ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఇక్కడి నుంచి కూడా భర్త సలీంతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతోంది. తర్వాత అక్టోబర్ 4న సలీం అతని భార్యకు వీడియో కాల్ చేశాడు.

The husband divorced his wife after going to a beauty parlor and getting her eyebrows cut.

తన భార్యను చూసిన సలీం వెంటనే ఆమె కనుబొమ్మలు కట్ చేయించుకున్న విషయం గమనించి ఆమెతో గొడవ పెట్టుకున్నాడని తెలిసింది. భార్య గుల్సాబా తాను బ్యూటీ పార్లర్‌కి వెళ్లి కనుబొమ్మలు కట్ చేయించుకున్నానని ఆమె భర్త సలీంకు చెప్పింది. ఇది విన్న తన భర్త సలీంకు వెంటనే కోపం వచ్చిందని అతని భార్య పోలీసులకు చెప్పింది. నా భర్త సలీం కాస్త పాత ఫ్యాషన్‌ ఫాలో అవుతున్నాడని, నేను మేకప్ వేసుకోవడం, బ్యూటీ పార్లర్‌కి వెళ్లడం తన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదని, నేను నా కనుబొమ్మలను కొంచెం మాత్రం కట్ చేశానని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

నేను నా భర్త సలీంతో మరోసారి మాట్లాడినప్పుడు అతను ఈ విషయంపై మళ్లీ గొడవ ప్రారంభించాడని, నేను నీకు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నానని తన భర్త ఫోన్ లో తలాక్ తలాక్ తలాక్ అని మూడుసార్లు చెప్పాడని, నేను మాట్లాడుతున్నా అతను ఫోన్ కట్ చేశాడని బాధితురాలు గుల్సాబా పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత కూడా తన భర్తకు చాలాసార్లు ఫోన్ చేసానని, కానీ నా భర్త సలీం నా ఫోన్ కాల్ రిసీవ్ చెయ్యలేదని బాధితురాలు గుల్సాబా పోలీసు కేసు పెట్టింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+