అందమైన భార్య మీద అనుమానం, అర్దరాత్రి బెడ్ రూమ్ లో ఏం జరిగిందంటే, ఫోన్ లు ?
బెంగళూరు/కోలారు: కుటుంబ సభ్యులు ఓ యువతి, యువకుడి పెళ్లి సెట్ చేశారు. మొదటి చూపుల్లో యువతిని చూడగానే ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. అందమైన భార్య చిక్కిందని అతను సంతోషించాడు. పెళ్లి చేసుకుని అతని భార్యతో సంతోషంగా కాపురం మొదలుపెట్టాడు. అయితే అందమైన భార్య మీద ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో ఆమెను చిత్రహింసలకు గురి చేసి చివరికి ఆమెను ఈలోకలంలో లేకుండా చేశాడు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు పట్టణంలోని మిల్లత్ నగర్ లో సయ్యద్ షోయబ్ అలియాస షోయబ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కోలారు పట్టణంలోని వేరే ప్రాంతంలో మోహనూర్ అలియాస్ నూర్ (22) అనే యువతి నివాసం ఉంటున్నది. బంధువులు పెళ్లి సమయంలో షోయబ్ కుటుంబ సభ్యులు నూర్ అనే యువతిని చూశారు.

అందంగా ఉన్న నూర్ ను షోయబ్ కు ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటారని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. నూర్ ను చూసిన షోయబ్ కూడా ఆమె అందం చూసి ఫిదా అయ్యాడు. పెళ్లి చేసుకుంటే నూర్ నే చేసుకుంటాను అంటూ షోయబ్ సినిమా డైలాగ్ లు చెప్పాడు. నూర్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. ఏడాది క్రితం నూర్, షోయబ్ ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది.
బంధువులు, స్నేహితులు షోయబ్, నూర్ ల పెళ్లికి హాజరై ఇద్దరిని ఆశీర్వదించారు. పెళ్లి సమయంలో నూర్ కుటుంబ సభ్యులు అల్లుడు షోయబ్ కు భారీ మొత్తంలో కట్నకానుకల కింద నగదు, బంగారు నగలు ఇచ్చారు. అయితే వివాహం జరిగిన తరువాత అందమైన భార్య నూర్ మీద షోయబ్ కు అనుమానం ఎక్కువ అయ్యింది. ఒకే ఊరిలో ఉంటున్న పుట్టింటికి ఎక్కువగా వెళ్లి వస్తున్న భార్య నూర్ మీద ఆమె భర్త షోయబ్ కు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది.

భార్య నూర్ అక్రమ సంబంధం పెట్టుకుని పదేపదే పుట్టింటికి వెలుతోందని రగిలిపోయిన షోయబ్ ఆమెను చితకబాదేశాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అందరికి తెలిస్తే పరువుపోతుందని భయపడిన షోయబ్ ఆమెను వరకట్నం తీసుకురావాలని చిత్రహింసలకు గురిచేశాడు. అదనపు వరకట్నం తీసుకురావడానికి నిరాకరించిన నూర్ ను గొంతునులిమి చంపేసిన షోయబ్ నా భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మించడానికి ప్రయత్నించాడు. అయితే నూర్ కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు షోయబ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications