Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నువ్వు ఎంత మందితో ఎంజాయ్ చేస్తే నేను అంత హ్యాపీగా ఉంటా, లేడీ టెక్కీతో భర్త !

బెంగళూరు/విజయవాడ: ఇంజినీరింగ్ చదివి ఐటీ కంపెనీలో చేరిన ఓ యువకుడితో ప్రేమలో పడిన యువతికి కష్టాలు తప్పలేదు. అతను ఆమెను గంజాయి తాగమని వేధించడమే కాకుండా నువ్వు ఆనందంగా ఉండాలంటే తన స్నేహితులతో కలిసి బెడ్ రూమ్ లో పడుకోమని భర్త బలవంతం చేశాడు. నువ్వు ఎంత మందితో ఎంజాయ్ చేస్తే నేను అంత హ్యాపీగా ఉంటానని లేడీ టెక్కీకి ఆమె భర్త చెప్పాడు.

ఓ టెక్కీ గంజాయి మత్తులో ఉంటూ అతని భార్యకు పడక సుఖం ఇవ్వలేక అతని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యాలని డైరెక్ట్ గా చెప్పడంతో అతని భార్య బిత్తరపోయింది. ఎవడైనా భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిస్తే ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇక్కడ ఆంధ్రా టెక్కీ రివర్స్ లో ప్రవర్తించాడు.

fight2
పెళ్లి అనేది స్వర్గంలో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటారు. జీవితాంతం సుఖాల్లో, కష్టాల్లో దంపతులు ఇద్దరూ ఒకరికి ఒకరు భాగం అవుతామని అనుకుంటారు. పెళ్లయ్యాక భర్త కష్టాలు ఇచ్చే వాడు అయితే ఎలా ఉంటుంది. భర్తతో దేహాన్ని పంచుకోవాలని భార్య అనుకుంటుంది. అయితే భర్త అతని స్నేహితులతో మంచం పంచుకోవాలని భార్య మీద ఒత్తిడి చేస్తే ఆ దుస్థితి ఎలా ఉంటుందో ఆడవాళ్లు అర్థం చేసుకుంటారు.

తన స్నేహితులతో ఎంజాయ్ చేసి వారితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని పదేపదే ఒత్తిడి చేస్తున్న భర్త తీరుతో విసిగిపోయిన అతని భార్య రగిలిపోయింది. భర్త ఆగడాలు రోజురోజుకు ఎక్కువ కావడంతో ఆమె టెక్కీ మొగుడి టార్చర్ నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా కూడా బుద్ది మార్చుకోని మొగుడు కేసు వెనక్కి తీసుకోవాలని అతని భార్యను బెదిరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

తన భర్త అతని స్నేహితులతో కలిసి తన మీద అత్యాచారానికి ప్రయత్నించాడని భార్య కేసు పెట్టిన ఘటన ఐటీ హబ్ బెంగళూరులో చోటుచేసుకుంది. భర్త స్నేహితులు అతడి ముందే అతని భార్యకు మత్తుమందు, గంజాయి తాగించి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారని వెలుగు చూసింది. భర్త స్నేహితులతో కలిసి భార్యను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి.

couplefighting1

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన భర్తపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరులోని సుబ్రమణ్యపూర పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇంట్లో భార్యతో గంజాయి తాగించిన భర్త స్నేహితులు తరువాత ఆమె మీద అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. తప్పించుకున్న అతని భార్య పరుగు తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయినా కూడా భర్త అతని భార్యకు డబ్బులు ఇచ్చి కేసు వెనక్కి తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆగ్రహించిన మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన అఖిలేష్ ధర్మరాజ్ అని పోలీసులు తెలిపారు. భార్య, భర్త ఇద్దరూ ఐటీ కంపెనీ ఉద్యోగులే. బెంగళూరులోని వసంత్‌పుర ప్రాంతంలో నివాసం ఉండే అఖిలేష్‌ను మ్యాట్రిమోనీలో చూసి ఒకరితో ఒకరు మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు.

తర్వాత ఇరువురి కుటుంబాలను ఒప్పించి 2019లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం దంపతులు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్ నివసిస్తున్నారు. మొదట్లో బాగానే ఉన్న భర్త అఖిలేష్ ధర్మరాజ్ రానురాను అతని స్నేహితులతో కలిసి ఇంటికి గంజాయి తీసుకొచ్చి సేవించేవాడు. ఇదే సమయంలో గంజాయి మత్తులో ఉన్న అఖిలేష్ ధర్మరాజ్ అతని భార్యను నిత్యం వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి.

police

భర్త హాల్ లో అతని ఫ్రెండ్స్ తో కలిసి గంజాయి సేవిస్తుంటే అతని భార్య బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయింది. బెడ్ రూమ్ లోకి వెలుతున్న అఖిలేష్ ధర్మరాజ్ అతని భార్యను సిగరేట్లతో కాల్చేవాడని, తన స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని టార్యర్ పెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి. భర్త అఖిలేష్ ధర్మరాజ్ వేధింపులు ఇంతటితో ఆగలేదు. చివరకు స్నేహితులును ఇంటికి తీసుకొచ్చి గంజాయి పార్టీ చేసుకున్నాడు. ఈ సమయంలో అతని స్నేహితులు టెక్కీ మహిళను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు.

భర్త అఖిలేష్ ధర్మరాజ్, అతని స్నేహితుల టార్చర్ ఎక్కువ కావడంతో ఇంటి నుంచి పారిపోయిన భార్యను తిరిగి పిలుచుకుని రావాలని అఖిలేష్ ధర్మరాజ్ ప్రయత్నించాడు. అంతేకాదు ఈ విషయం బయటపెడితే చంపేస్తానని అఖిలేష్ ధర్మరాజ్ అతని భార్యను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఓ మహిళ ఫిర్యాదు చేసినా పోలీసులు నిందితులను పట్టుకోలేదు. అయితే ఆ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో పోలీసులు నిందితుడు అఖిలేష్ ధర్మరాజ్ ను అదుపులోకి విచారణ చేస్తున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+