భార్య గర్బవతి, అంతా నా ఖర్మ అంటూ రివాల్వర్ తో కాల్చుకున్న భర్త, కథలో ?
వివాహం చేసుకున్న తరువాత దంపతుల మద్య చిన్నిచిన్న గొడవలు జరగడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, పెద్దలు సెట్ చేసిన పెళ్లి అయినా కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక భార్య ఆమె భర్తను టార్చర్ పెడితే ఊహించుకోవడమే కష్టం. ఇలాంటి ఫ్యామిలీలో భార్య గర్బవతి అని తెలుసుకున్న భర్త అంతా నాఖర్మ అంటూ రివాల్వర్ తో అతన్ని అతనే షూట్ చేసుకున్నాడు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. సోనూ అనే యువకుడు నుదుటిపై రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే సోనూను ఆస్పత్రికి తరలించడంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం సోనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన భరత్‌పూర్ జిల్లా ఉచ్చైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం సోనూకు రేఖ అనే యువతితో వివాహమైంది. అన్ని కేసుల్లో భర్తలు వాళ్ల భార్యలను టార్చర్ పెడుతుంటే ఈ కేసులో రివర్స్ లో భార్య ఆమె భర్త సోనూను టార్చర్ పెట్టింది. పెళ్లయిన తర్వాత సోనూని అతని భార్య రేఖ వేధిస్తున్నట్లు సమాచారం. సోను ఏం అడిగినా రేఖ సమాధానం చెప్పడం లేదని, అసలు భర్తను ఆమె పట్టించుకోవడం లేదని ఆరోపణు ఉన్నాయి.ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ విషయాన్ని సోనూ తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. కొత్తగా పెళ్లయిన జంటలకు ఇలావి జరుగుతుంటాయని, చిన్నచిన్న గొడవలు మామూలే అని సోనూ, రేఖా కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. నిత్యం భార్య రేఖ చిత్రహింసలకు గురికావడం, కుటుంబ కలహాలతో విసిగిపోయిన సోనూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

సోనూ, రేఖల కుటుంబ సభ్యుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. సోనూ కోపంతో గదిలోకి వెళ్లిపోయాడు. తరువాత సోనూ ఉన్న గదిలో నుంచి తుపాకి కాల్పులతో పెద్ద శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సోనూ కుప్పకూలిపడి ఉన్న విషయం చూసిన అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు. వెంటనే తల్లిదండ్రులు సోనూను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
భార్య రేఖ గర్భవతి అయినా సోనూ మాత్రం సంతోషంగా లేడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. రివాల్వర్ తో తానే కాల్చుకున్నానని సోనూ స్టేట్‌మెంట్ ఇచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. సుమారు ఆరు నెలల క్రితం గ్రామ శివారులో రెండు తుపాకులు సోనూకు దొరికాయి. అయితే పోలీసులకు చెప్పకుండా సోనూ ఆ రెండు తుపాకులను తన వద్దే ఉంచుకున్నాడు. అదే తుపాకీతో సోనూ కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు సోను ఇంటిలో ఉన్న రెండు తుపాకులను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?












Click it and Unblock the Notifications