వ్యాపారి భార్య అక్రమ సంబంధం మ్యాటర్ లీక్, గుడిలో అడ్డంగా నరికేసిన భర్త, మాట వినకుంటే !
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో ఇరువైపు కుటుంబ సభ్యులు దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఒకే జిల్లాలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అత్తమామలతో పాటు భార్య, బంధువులు ఆ దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నారు. భార్య అక్రమ సంబంధం విషయంలో రగిలిపోయిన భర్త కొడవలి తీసుకుని గుడిలోనే దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.
కర్ణాటకలోని మైసూరు జిల్లా సమీపంలోని నంజనగూడు జిల్లాలోని హోసహళ్లి గ్రామంలో సోమయ్య అలియాస్ సోము అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే ఊరిలో మారమ్మదేవి గుడిలో మహదేవస్వామి అలిమాస్ మహదేవ అనే వ్యక్తి పూజారిగా పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను సోము వివాహం చేసుకున్నాడు.

వివాహం చేసుకున్న తరువాత సోము, రేఖా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య రేఖా ఏదైనా అడిగితే వెంటనే తీసుకువచ్చి ఇచ్చే సోము ఆమెను పువ్వులో పెట్టుకుని చూసుకునేవాడు. రేఖా అదే ఊరిలోని మారమ్మగుడికి వెళ్లి వచ్చేది. ఇదే సందర్బంలో మారమ్మ గుడిలో పూజారిగా పని చేస్తున్న మహదేవస్వామి రేఖాకు పరిచయం అయ్యాడు. వ్యాపారం చేస్తున్న సోము అప్పుడుప్పుడు బయట ఊర్లకు వెళ్లి రెండు మూడు రోజులు అక్కడే ఉండిపోయాడు.
గుడికి ఎక్కువగా వచ్చి వెలుతున్న రేఖా అక్కడ పని చేసే పూజారి మహదేవస్వామితో చనువు పెంచుకుంది. రానురాను గుడిలో పూజారి మహదేవస్వామి, రేఖా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. భర్త సోము వ్యాపారం పనిమీద బయట ఊర్లకు వెళ్లిన సమయంలో ప్రియుడు మహదేవస్వామిని ఇంటికి పిలిపించుకుంటున్న రేఖా అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

చాలాకాలంగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న రేఖా వ్యవహారం ఆమె భర్త సోముకు ఇటీవల తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని, ఊరిలో తాను పరువుగా బతుకుతున్నానని, తన పరువు తీస్తే నిన్ను చంపేస్తానని సోము అతని భార్య రేఖాను హెచ్చరించాడు. అయితే భర్త సోము మాటలు లెక్క చెయ్యకుండా రేఖా ఆమె ప్రియుడు మహదేవస్వామితో ఎంజాయ్ చెయ్యడం మాత్రం వదల్లేదు.
భార్య రేఖా పద్దతి మార్చుకోకపోవడంతో రగిలిపోయిన సోము నా భార్యను వదిలేయాలని, ఆమెను కలవకూడదని ఆమె ప్రియుడు మహదేవస్వామికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే మహదేవస్వామి కూడా పద్దతి మార్చుకోలేదని తెలిసింది. మహదేవస్వామిని అంతం చెయ్యాలని సోము కొంతకాలంగా ఎదురు చూశాడు. ఆదివారం రాత్రి గుడిలో పూజలు పూర్తి చేసిన మహదేవస్వామి అక్కడే నిద్రపోయాడు.

మహదేవస్వామి ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్న సోము కొడవలి తీసుకుని వెళ్లాడు. మారమ్మగుడిలో నిద్రపోతున్న భార్య ప్రియుడు మహదేవస్వామిని దారుణంగా నరికి చంపేసిన సోము అక్కడి నుంచి పరారైనాడు. సోమవారం ఉదయం గుడికి వెళ్లిన స్థానికులు పూజారి మహదేవస్వామి హత్యకు గురైనాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. మహదేవస్వామిని హత్య చేసిన సోము కోసం గాలిస్తున్నామని నంజనగూడు పోలీసులు తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications