Wife: పక్కింటోడితో నీకు గంటలు గంటలు ఏం పని, భార్యను చంపేసి బ్యారెల్ ప్యార్సిల్ !
భార్య పక్కింటోళ్లతో ఎక్కువగా మాట్లాడుతున్నదని, వాళ్ల ఇంటికి వెళ్లి గంటలు గంటలు ఉండి వస్తోందని తెలుసుకున్న భర్త భార్యను చంపేసి నీటిని నింపే బ్యారల్ లో డ్రమ్ నీట్ గా ప్యాక్ చేసి తీసుకెళ్లాడు.
బెంగళూరు/మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించారు. దంపతులకు ఇంకా పిల్లలు లేరు. భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. వ్యాపారం చేస్తున్న భర్త ఎప్పుడు బయటకు పోతాడో, ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలీదు. ఇదే సమయంలో భార్య పక్కింటోళ్లతో ఎక్కువగా మాట్లాడుతున్నదని, వాళ్ల ఇంటికి వెళ్లి గంటలు గంటలు ఉండి వస్తోందని తెలుసుకున్న భర్త ఆమెతో గొడవలు పడుతున్నాడు. చివరికి భార్యను చంపేసి నీటిని నింపే డ్రమ్ లో ఆమె శవాన్ని నీట్ గా ప్యాక్ చేసి తీసుకెళ్లి రిజర్వు ఫారెస్ట్ లో విసిరేశాడు. భర్త ఇల్లు ఖాళీ చేస్తుంటే ?.

దంపతులు హ్మాపీ
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కారవార సమీపంలోని హళియాల పట్టణంలో తుకారామ్ మడివాళ అలియాస్ తుకారామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శాంతకుమారి (38) అనే మహిళను తుకారామ్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న శాంతకుమారి, తుకామరామ్ దంపతులు చాలా సంతోషంగా జీవించారు. హళియాల పట్టణంలో అద్దె ఇంటిలో శాంతకుమారి, తుకామరామ్ దంపతులు నివాసం ఉంటున్నారు.

పక్కింట్లో గంటలు గంటలు నీకు ఏంపని ?
నిందితుడు జిల్లాలోని హలియాల తాలూకా తెరగావ్ గ్రామానికి చెందిన తుకారామ్, హళియూలలో చాలాకాలంగా నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న తుకారామ్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఇదే మయంలో శాంతకుమారి ఆపక్కింటిలో నివాసం ఉంటున్న వారితో ఎక్కువగా మాట్లాడుతోందని తుకారామ్ కు తెలిసింది. ఇదే సమయంలో తన భార్య శాంతకుమారి పక్కింటోళ్లతో ఎక్కువగా మాట్లాడుతున్నదని, వాళ్ల ఇంటికి వెళ్లి గంటలు గంటలు ఉండి వస్తోందని తెలుసుకున్న తుకారామ్ రగిలిపోయి అతని భార్యతో గొడవలు పడుతున్నాడు.

భార్య శవాన్ని నీళ్ల డ్రమ్ లో ప్యాక్ చేసిన భర్త
పక్కింటోళ్లతో ఎక్కవ మాట్లాడుతోందనే విషయంలో గొడవ పడిన తుకారామ్ అతని భార్య శాంతకుమారిని గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత భార్య శాంతకుమారి శవాన్ని ఖాళీ వాటర్ బారెల్ ల్లో ప్యాక్ చేశాడు. ఆ రోజు మొత్తం శాంతకుమారి శవం ఇంట్లోనే ఉంది. మరుసటి రోజు టాటా ఏస్ వాహనం అద్దెకు తీసుకున్న తుకారామ్ అతని భార్య శాంతకుమారి మృతదేహం ఉన్న వాటర్ బ్యారెల్ పెట్టుకుని కారవార సమీపంలోని దట్టమైన అడవుల్లో పడేసి ఇంటికి వచ్చేశాడు.

ఇంటి ఓనర్ కు డౌట్ వచ్చింది
భార్య శాంతకుమారి శవాన్ని మాయం చేసిన తుకారామ్ ఇంటికి వెళ్లి హడావుడిగా ఇల్లు ఖాళీ చెయ్యాలని కొన్ని సామాన్లు టాటా ఏస్ వాహంలో ఎక్కించాడు. ఎందుకు అంత హడావిడిగా ఇల్లు ఖాళీ చేస్తున్నావు అని ఇంటి యజమాని తుకారామ్ ను ప్రశ్నించాడు. ఇదే సమయంలో తుకారామ్ ఇంటి ఓనర్ గురించి పట్టించుకోకుండా వాహనంలో కొన్ని వస్తువులను ఎక్కించుకున్నాడు.

మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది
ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తున్నావు అని ఇంటి యజమాని ప్రశ్నించగా తాను చాలా అర్జెంట్ గా గోవా వెళ్తానని, అందుకే ఇళ్లు ఖాళీ చేస్తున్నానని తుకారామ్ ఇంటి ఓనర్ కు చెప్పాడు. ఇంట్లో నిత్యం భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్న విషయం ముందు నుంచి తెలిసిన ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.

నాకాబంధీలో చిక్కిపోయిన భర్త
అప్పటికే తుకారామ్ ఇల్లు ఖాళీ చేసుకుని వాహనంలో వెళ్లిపోయాడు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించగా ఊరి బయట తుకారామ్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో శాంతకుమారి హత్య విషయం వెలుగు చూసింది. శాంతకుమారి
హత్యకు తుకారామ్ కు సహకరించిన రిజ్వాన్, సమీర్ అనే నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కారవార పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications