లవ్ మ్యారేజ్, పెళ్లి అయినా అందరిని లవ్ చేస్తున్న భార్య, భర్తకు ఎక్కడో కాలిపోయి ఏం చేశాడంటే !
ఐటీ హబ్ లో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా ఉన్న యువతి, యువకుడు తరువాత ప్రేమించుకున్నారు. ఐటీ హబ్ లో ప్రేమపాపురాలు ఏమాత్రం హద్దులు లేకుండా హ్యాపీగా తిరిగాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమికులు కాపురం పెట్టారు. అయితే అందరి ముందు భార్యను కిరాతంగా పొడిచి చంపేసిన భర్త తరువాత చేతులు దులుపుకున్న భర్త పీడపోయిందని అనుకున్నాడు.తన సోదరి నిశ్చితార్థానికి రాలేదని ఓ భర్త అతని భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
జయప్రకాష్ (32) అనే వ్యక్తి అతని భార్యను హత్య చేశాడని పోలీసులు అన్నారు. తన సోదరి నిశ్చితార్థానికి తన భార్య రాలేదని ఆమెను హత్య చేశానని జయప్రకాష్ చెప్పాడని, అయితే అసలు కథ వేరే ఉందని బెంగళూరు పోలీసులు అన్నారు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన భార్య దివ్యశ్రీ (26) చనిపోయిందని పోలీసులు అన్నారు.

బెంగళూరు నగరంలోని సుంకడకట్టె సమీపంలోని సొల్లపురదమ్మ దేవాలయం సమీపంలో జయప్రకాష్ అతని భార్య జయశ్రీని హత్య చేశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నిందితుడు జయప్రకాష్ చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం జయప్రకాష్, దివ్యశ్రీ ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా తిరిగిన ప్రేమికులు జయప్రకాష్, దివ్యశ్రీ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
వివాహానికి తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఇద్దరూ బెంగళూరులోని మూడళపాళ్యలో అద్దె ఇల్లు తీసుకుని ప్రత్యేకంగా కాపురం పెట్టారు. జయప్రకాష్, దివ్యశ్రీ ఇద్దరు ఉద్యోగాలు చేసేవారు. ఉదయం బయటకు వెలుతున్న దివ్యశ్రీ సాయంత్రం ఇంటికి వచ్చేది. అయితే ప్రేమ వివాహం చేుకున్న భార్య దివ్యశ్రీపై అనుమానం రావడంతో జయప్రకాష్ రగిలిపోయాడు. తన భార్య దివ్యశ్రీ అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని రగిలిపోయిన జయప్రకాష్ రోజు మద్యం సేవించి వచ్చి అతని భార్యను చితకబాదడం మొదలు పెట్టాడు.
చివరికి భార్య దివ్యశ్రీ మీద విపరీతంగా అనుమానం రావడంతో మూడపాళ్యలో ఇల్లు కాలి చేసిన జయప్రకాష్ ఆ ప్రాంతానికి దూరంగా సుంకదకట్టలో కాపురం పెట్టాడు. అయితే సుంకదకట్టకు ఇల్లు మార్చిన దంపతులు అక్కడ కూడా గొడవలు పడటం మొదలుపెట్టారు. అయితే భార్య దివ్యశ్రీపై అనుమానం పెంచుకునే నిందితుడు జయప్రకాష్ రోజూ మద్యం మత్తులో ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడేవాడు.

ప్రతిరోజు గ్యాప్ లేకుండా భార్య దివ్యశ్రీని చితకబాదిన జయప్రకాష్ ఆమెను బెండ్ తీశాడు. సుంకదకట్టలో కూడా భార్య దివ్యశ్రీ మీద అనుమానం పెంచుకుని ఆమెను ఉతికేశాడు. ఇదే సమయంలో జయప్రకాష్ చెల్లికి నిశ్చితార్థం జరిగింది. ఆడపడుచు నిశ్చితార్థానికి వెళ్లకుండా దివ్యశ్రీ ఆ శుభకార్యం గురించి పట్టించుకోవడం మానేసింది. తన సోదరి నిశ్చితార్థానికి ఎందుకు రాలేదని దివ్యశ్రీతో ఆమె భర్త జయప్రకాష్ గొడవపడ్డాడు.
తరువాత కోపోద్రిక్తుడైన జయప్రకాష్ కత్తితో భార్యను పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో నిందితుడు జయప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పైకి మాత్రం సోదరి నిశ్చితార్థానికి రాలేదని తన భార్య దివ్యశ్రీని హత్య చేశానని జయప్రకాష్ చెబుతున్నాడని, అయితే భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతోనే ఆమెను హత్య చేశాడని పోలీసులు అంటున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications